కశ్మీర్: తిట్రినోట్ క్రాసింగ్ పాయింట్ వద్ద కలుసుకున్న కశ్మీరీ కుటుంబాలు

వీడియో క్యాప్షన్, తిట్రినోట్‌‌ ప్రాంతం నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

జమ్ము- కశ్మీర్‌‌‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని తిట్రినోట్ దగ్గర ఒక క్రాసింగ్ పాయింట్ ఉంది. దేశవిభజన సమయంలో విడిపోయిన కశ్మీరీ ముస్లిం కుటుంబాలను ఇది కలుపుతూ ఉంటుంది.

కశ్మీర్‌ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన ఈ ప్రాంతాన్ని ఇటీవల తెరిచారు. దాంతో భారత పాలిత కశ్మీర్‌లోని కొన్ని కుటుంబాలు పాక్ పాలిత కశ్మీర్‌లో ఉన్న తమవారిని కలుసుకోడానికి తిట్రినోట్ వచ్చాయి.

అక్కడికి వచ్చినవారిని పలకరించిన బీబీసీ ప్రతినిధి రిఫత్ ఉల్లాహ్ అక్కడి పరిస్థితిని చిత్రీకరించారు.

చాలా రోజుల తర్వాత అక్కడికి వచ్చిన ఖ్వాజీ జమాలుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ లోయలో పరిస్థితులను వివరించారు.

అక్కడకు వచ్చిన ఓ వృద్ధురాలు తన బంధువులను కలిసినందుకు సంతోషించారు.

మూడు వారాల నుంచి తిట్రినోట్‌లో స్కూళ్లు మూసివేశారు. చాలా రోజున తర్వాత ఈ క్రాసింగ్ పాయింట్‌ను తెరవడంతో స్థానికులు సంతోషపడుతున్నారని బీబీసీ ప్రతినిధి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)