You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్రికెట్ వరల్డ్ కప్ 2019: వర్షం వల్ల భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు
వరల్డ్ కప్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దైంది. రెండు జట్లకూ చెరో పాయింటు లభించింది.
నాటింగ్హమ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా, వర్షం కారణంగా ఆట సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా అని దాదాపు నాలుగున్నర గంటలకు పైగా టోర్నీ అధికారులు నిరీక్షించారు.
అయితే, వర్షం మాత్రం తగ్గలేదు. మైదానం అంతా చిత్తడిగా మారింది.
చివరికి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈసారి వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే, అయితే, వానలు టోర్నీకి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
తాజా మ్యాచ్‌తో కలిపి, ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైపోయాయి.
భారత్ తదుపరి మ్యాచ్ పాకిస్తాన్‌తో..
టోర్నీలో ఇంతవరకూ భారత్, న్యూజీలాండ్ మాత్రమే అజేయంగా ఉన్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు భారత్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలపై విజయాలు నమోదు చేసింది.
తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ పోరు వచ్చే ఆదివారం మాంచెస్టర్‌లో జరుగుతుంది.
టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాక్, కేవలం ఒక్కదానిలోనే గెలిచింది. రెండింట్లో పరాజయంపాలైంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది.
పాయింట్స్ టేబుల్‌లో న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఆ తర్వాత స్థానాల్లో వరుసగా శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- క్రికెట్ వరల్డ్ కప్ 2019: పోటీ ఈ మూడు జట్ల మధ్యే ఉంటుందా?
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- సల్వాజుడుం: నిర్వాసితులైన 30 వేల మందికి అటవీ భూమిపై హక్కులు లభిస్తాయా?
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)