ఈ స్కూల్లో ప్లాస్టిక్ వ్యర్థాలే ఫీజు

వీడియో క్యాప్షన్, ఈ స్కూల్లో ప్లాస్టిక్ వ్యర్థాలే ఫీజు

అసోంలోని ఓ స్కూల్లో చిన్నారుల నుంచి ఫీజుగా కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలనే తీసుకుంటున్నారు. ప్రతి విద్యార్థీ వారానికి కనీసం 25 బాటిళ్లను స్కూల్‌కు తెచ్చివ్వాలి.

పర్మితా శర్మ అనే మహిళ మరికొందరితో కలిసి పేద చిన్నారుల కోసం అక్షర్ ఫోరం అనే ఈ స్కూల్‌ను స్థాపించారు.

చలికాలంలో వెచ్చదనం కోసం ప్లాస్టిక్ బాటిళ్లతో చలిమంట వేసుకుంటున్నట్లు విద్యార్థులు చెప్పడంతో తాము ఈ కొత్త ఫీజు విధానం తెచ్చామని పర్మితా వివరించారు.

సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లలో ప్లాస్టిక్ కవర్లు నింపి, వాటిని ఇటుకల్లా పేరుస్తూ విద్యార్థులు చెట్ల చుట్టూ గోడలు కడుతున్నారు. వాటితో చిన్న వంతెనలు కూడా నిర్మించాలని అక్షర్ ఫోరం భావిస్తోంది.

తాము తెచ్చిన నిబంధన వల్ల ప్లాస్టిక్‌ను తగులబెట్టడం వల్ల కలగే హాని గురించి విద్యార్థులకు అవగాహన పెరిగిందని, చిన్నారులు వారి తల్లిదండ్రులకూ ఈ విషయం గురించి వివరిస్తున్నారని పర్మితా అన్నారు.

వారి స్కూల్ గురించి మరిన్ని విషయాలు, వివరాలను పై వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)