You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#SRHvDC ఐపీఎల్ 2019 ఎలిమినేటర్: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రెండు వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ గెలుపు
ఐపీఎల్ 2019 క్వాలిఫయర్-2లో పోటీ పడబోయే జట్లేవో తేలిపోయింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.
బుధవారం విశాఖపట్నంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఉత్కంఠగా సాగిన చివరి ఓవర్‌లో ఫీల్డింగ్‌ను అడ్డుకున్నందుకు అమిత్ మిశ్రా ఔట్ అయ్యాడు. అయితే ఆ మరుసటి బంతిని (మరో బంతి మిగిలి ఉండగా) కీమో పాల్ బౌండరీ దాటించడంతో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
అంతకు ముందు... 15 ఓవర్లోనే నాలుగో బంతికి అక్షర్ పటేల్ డక్ అవుట్ అయ్యాడు.
జట్టు స్కోరు 111 పరుగుల దగ్గర 15వ ఓవర్లో తొలి బంతికి మున్రో(14) అవుట్ అయ్యాడు.
11 ఓవర్లోనే చివరి బంతికి జట్టు స్కోరు87 ఉన్నప్పుడు పృథ్వీ షా(56) అవుట్ అయ్యాడు.
11 ఓవర్లో 84 పరుగుల దగ్గర కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(8) అవుట్ అయ్యాడు.
8వ ఓవర్లో 66 పరుగుల దగ్గర దిల్లీ ఓపెనర్ శిఖర్ ధవన్(17) వికెట్ కోల్పోయింది.
163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది.
ఓపెనర్లు శిఖర్ ధావర్ (15 పరుగులు), పృథ్వీ షా (39 పరుగులు) బ్యాటింగ్ చేస్తున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.
భువనేశ్వర్ కుమార్ (0 పరుగులు), థంపి (1 పరుగు) నాటౌట్‌గా నిలిచారు. దిల్లీ బౌలర్లలో కీమర్ పాల్ 3 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు.
చివరి ఓవర్ 5వ బంతికి రషీద్ ఖాన్ (0 పరుగులు) ఔటయ్యాడు.
చివరి ఓవర్ 5వ బంతికి దీపక్ హూడా (4 పరుగులు) రనౌట్ అయ్యాడు.
చివరి ఓవర్ 4వ బంతికి మొహమ్మద్ నబీ (20 పరుగులు) ఔటయ్యాడు.
19వ ఓవర్ 3వ బంతికి విజయ్ శంకర్ (25 పరుగులు) ఔటయ్యాడు.
16వ ఓవర్ 5వ బంతికి కేన్ విలియమ్సన్ (28 పరుగులు) ఔటయ్యాడు.
14వ ఓవర్ 3వ బంతికి మనీష్ పాండే (30 పరుగులు) ఔటయ్యాడు.
7వ ఓవర్ 3వ బంతికి ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (36 పరుగులు) ఔటయ్యాడు.
4వ ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (8 పరుగులు) ఔటయ్యాడు.
అంతకు ముందు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
తాము టాస్ గెలిచినా కూడా బౌలింగే ఎంచుకునేవాళ్లమని సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈనెల 10వ తేదీ శుక్రవారం క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆడుతుంది. క్వాలిఫయర్ 2 మ్యాచ్ కూడా విశాఖపట్నంలోనే జరుగనుంది. 12వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లో ఫైనల్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2019: ఫైనల్లో ముంబై, సొంతగడ్డపై ధోనీసేనకు పరాజయం
- ఐపీఎల్ 2019: చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు సక్సెస్ సీక్రెట్ చెప్పిన ధోనీ
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- 'భర్త కళ్ల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. మొబైల్‌తో షూటింగ్'
- మామిడి పళ్లు నోరూరిస్తున్నాయా.. కార్బైడ్‌తో జాగ్రత్త
- ఒసామా బిన్ లాడెన్: ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది
- ప్రేమ వివాహం చేసుకున్నారని కొత్త జంటపై పెట్రోల్ పోసి సజీవ దహనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)