వీవీప్యాట్‌ల లెక్కింపుపై విపక్షాల రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

50 శాతం ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని కోరుతూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా 21 విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.

ఒకే అంశంపై తాము ఎన్నిసార్లు విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఈ అభ్యర్థనపై ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని న్యాయస్థానం తెలిపింది.

ఈ విషయంలో తాము జోక్యం చేసుకోదలచుకోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ 21 విపక్షాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై కోర్టు మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)