వరల్డ్ కప్ 2019: విరాట్ కోహ్లి సేన ఇదే... అంబటి రాయుడు, రిషభ్‌లకు నో చాన్స్

మే 30న ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో అంబటి రాయుడుకు చోటు దక్కలేదు. వరల్డ్ కప్ కోసం ఆటగాళ్ల పేర్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు పంపడానికి ఏప్రిల్ 23 ఆఖరి తేదీ. కానీ భారత సెలక్టర్లు ఈ పనిని ఒక వారం ముందే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎంపికైన ఆటగాళ్లు మానసికంగా సిద్ధం కావడానికి వారికి తగిన సమయం ఇవ్వాలనుకోవడం కూడా దీని వెనుక కారణం కావచ్చు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో నంబర్ వన్‌గా ఉన్న భారత్ ఇప్పటివరకూ రెండు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. జట్టులోని ఆటగాళ్లు వీరే...

విరాట్ కోహ్లి (కెప్టెన్)

రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)

శిఖర్ ధవన్

కేఎల్ రాహుల్

విజయ్ శంకర్

మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్)

కేదార్ జాధవ్

దినేష్ కార్తీక్

యజువేంద్ర చాహల్

కుల్దీప్ యాదవ్

భువనేశ్వర్ కుమార్

స్‌ప్రీత్ బుమ్రా

హార్దిక్ పాండ్యా

రవీంద్ర జడేజా

మొహమ్మద్ షమీ

మొదట 1983లో భారత్ కపిల్ దేవ్ నేతృత్వంలో ఇంగ్లండ్‌లో చాంపియన్‌ అయ్యింది. తర్వాత 2011లో సొంతగడ్డపై మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది.

50 ఓవర్ల ఈ ఫార్మాట్‌లో ఒక బలమైన జట్టు కాంబినేషన్ అంటే, ఐదుగురు బ్యాట్స్‌మెన్లు, ఇద్దరు ఆల్‌ రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక వికెట్‌ కీపర్‌... అని భావిస్తారు.

తెలుగు ఆటగాడు అంబటి రాయుడుకు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు.

సెలక్టర్ల మనసులో 20 మంది ఆటగాళ్ల పూల్ ఉందని, దాని గురించి ఎలాంటి ఆందోళనా లేదని ఎమ్మెస్కే ప్రసాద్ రెండు నెలల ముందే స్పష్టం చేశారు.

‘‘వరల్డ్ కప్‌ జట్టులో ఎంపిక కోసం ఆటగాడి ఐపీఎల్‌లో ప్రదర్శనను ఆధారగా తీసుకోమని కూడా ఆయన చెప్పారు. అంటే ఒకవేళ జట్టులో దాదాపు పక్కాగా భావించే ఏ ఆటగాడైనా ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చూపించలేకపోయినా, దానివల్ల జట్టులో స్థానం కోల్పోవడం అనేది ఉండదు. కానీ ప్రసాద్ ఈ ఫార్ములా నిజంగా ఆటగాళ్లందరి విషయంలో వర్తిస్తుంది అనేది కూడా చెప్పలేం’’ అని బీబీసీ ప్రతినిధి దినేష్ ఉప్రేతీ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)