You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్మ్ రెజ్లింగ్: బలవంతులైన అబ్బాయిలు కూడా ఈ చేతులతో తలపడటానికి భయపడతారు
అవి తామరతూడల్లాంటి కోమలమైన చేతులు. ఏ కోణంలో చూసినా.. బలిష్టంగా, కండలు తిరిగి కనిపించవు. అలా అని ఆ చేతులు బలహీనమైనవి కావు.. బలవంతులైన అబ్బాయిలు కూడా ఈ చేతులతో తలపడటానికి భయపడతారు.
వీరంతా ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్‌లు. వీరిలో 14 ఏళ్ల ఖుషి, 41 ఏళ్ల రోహిణి కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 70దేశాల్లో ఈ క్రీడ ఉంది. కానీ దీనికింకా భారత ప్రభుత్వం గుర్తింపు దక్కాల్సి ఉంది.
‘‘ఆడవారు కూడా బలవంతులే. ఇంటి పనులు, ఆఫీస్ పనులు ఎంతో నేర్పుగా చేస్తున్నపుడు.. ఆటల్లో మాత్రం ఏం తక్కువ?’’ అని ఆర్మ్ రెజ్లర్ వర్తిక అభిప్రాయపడుతున్నారు.
ఇక 41ఏళ్ల వయసున్న రోహిణి మాట్లాడుతూ..
‘‘నా చిన్న కొడుకు.. 'మా అమ్మ గోల్డ్ మెడల్ గెలిచింది' అని వాడి స్కూల్‌లో చెప్పినపుడు, తోటి పిల్లలంతా.. మా అమ్మలు ఏమీ చేయడం లేదు, కానీ మీ అమ్మ.. గోల్డ్ మెడల్ సాధించిందే! అంటున్నారట. వాడి స్కూల్‌లో అందరికీ తెలుసు.. నేను ఆర్మ్ రెజ్లర్, పవర్ లిఫ్టర్ అని. గోల్డ్ మెడల్ సాధించానని కూడా అందరికీ తెలుసు. ఇది మా అందరికీ గర్వకారణం. ముఖ్యంగా తల్లికి..!’’ అన్నారు.
ఇక.. జిమ్‌లో తనను చాలెంజ్ చేసిన ఓ అబ్బాయిని మరో యువతి పూజ ఏం చేసిందో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
- జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్లో ముస్లిం’ ఎందుకయ్యారు?
- సిత్రాలు సూడరో: ఐదేళ్లలో నాలుగు కండువాలు మార్చేశారు
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ‘అభినందన్లా నా భర్త కూడా పాక్ సైన్యానికి చిక్కారు.. ఆయన కోసం 48ఏళ్లుగా ఎదురు చూస్తున్నా..’
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల సాధారణ ప్రజలకు మేలు జరగట్లేదు... మెజారిటీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)