You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11న
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలి దశలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి మార్చి 18 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.
18 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ 25 వ తేదీ నాటికి ముగుస్తుంది. 26 న నామినేషన్ల పరిశీలన, 28 న ఉపసంహరణకు చివరి తేదీ.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2014లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయితే, తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది.
ఏపీ, తెలంగాణ ఎన్నికలు-ముఖ్యాంశాలు
- ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 18
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 26
- నామినేషన్ల పరిశీలన: మార్చి 26
- నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28
- పోలింగ్: ఏప్రిల్ 11
- ఓట్ల లెక్కింపు: మే 23
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- ఫైర్ బ్రాండ్ సోషలిస్ట్ లీడర్ జార్జి ఫెర్నాండెజ్ మృతి
- వెంకయ్యనాయుడు వ్యాసం: ఎమర్జెన్సీ రోజుల్లో ఏం జరిగింది?
- ఈ దీవిలో 12 ఏళ్ల తర్వాత పాప పుట్టింది
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)