You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి డాన్స్ చేయడం నిజమేనా? : Fact Check
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తనను విడుదల చేస్తున్నారనే ప్రకటన రాగానే పాకిస్తానీ సైన్యంతో కలసి డాన్స్ చేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
విడుదల ప్రకటన రాగానే ఈ వీడియో అన్ని రకాల సోషల్ మీడియా వేదికలపైనా కనిపించింది. #WelcomeHomeAbhinandan, #PeaceGesture వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా షేర్ అయింది.
45 సెకన్ల ఈ వీడియోను వేలాది మంది చూశారు.
అయితే, ఈ వైరల్ వీడియో నిజమైంది కాదని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ టీం పరిశోధనలో తేలింది. 4 నిమిషాల నిడివి కలిగిన దీని అసలైన, పూర్తి వీడియో ఫిబ్రవరి 23, 2019న యూట్యూబ్‌లో షేర్ అయ్యింది.
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఓ పాకిస్తానీ జానపద గీతానికి డాన్స్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉన్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
అంటే ఈ వీడియో ఫిబ్రవరి 23 కన్నా ముందే చిత్రీకరించారు. అందువల్ల వింగ్ కమాండర్ వర్ధమాన్ ఈ వీడియోలో ఉన్నారనడం అసత్యం. ఎందుకంటే ఆయనను ఫిబ్రవరి 27న పాకిస్తాన్ సైన్యం అరెస్టు చేసింది.
ఈ వీడియోలో ప్రతి ఫ్రేమునూ జాగ్రత్తగా పరిశీలిస్తే... అందులో డాన్స్ చేస్తున్న అధికారుంతా పాకిస్తాన్ యూనిఫాం వేసుకుని ఉన్నారనే విషయం తెలుస్తుంది.
కానీ, ప్రస్తుతం అభినందన్ విడుదల సందర్భంగా ఈ వీడియోలో కొంత భాగాన్ని షేర్ చేస్తూ అందులో అభినందన్ కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి.
- అభినందన్: విమానం నుంచి పడగానే ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి కథనం - BBC EXCLUSIVE
- అభినందన్‌ను పాకిస్తాన్ ఎందుకు విడుదల చేస్తోంది? ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం వెనుక కారణాలేంటి?
- ప్రొటోకాల్ ఉల్లంఘించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీనేనా...
- నన్ను వ్యతిరేకించాలనుకుని కొందరు నేతలు దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు: విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
- కశ్మీర్ : ‘టార్చి లైటు వేస్తే సైనికుల తుపాకులకు బలికావాల్సి ఉంటుంది’
- భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తత- ఇప్పటి వరకూ ఏం జరిగింది- - BBC News వార్తలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)