You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సరిహద్దుల్లో మన వీర జవాన్లు పరాక్రమం ప్రదర్శిస్తున్నారు: మోదీ
భారతదేశాన్ని అస్థిరపరచటానికి, అభివృద్ధిని అడ్డుకోవటానికి శత్రువు ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు వద్ద, సరిహద్దుకు ఆవల దేశ సైనికులు పరాక్రమం ప్రదర్శిస్తున్నారని కీర్తించారు.
ప్రధాని మోదీ గురువారం ‘మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
‘‘మన వీర జవాన్లు సరిహద్దులోనూ, సరిహద్దుకు ఆవల కూడా తమ పరాక్రమం ప్రదర్శిస్తున్నారు. దేశం మొత్తం ఒక్కటై మన జవాన్లకు అండగా నిలుచుంది. మన ఉమ్మడి మనోబలాన్ని ప్రపంచం వీక్షిస్తోంది.
భారతదేశం ఒకటిగా జీవిస్తుంది. ఒకటిగా వృద్ధి చెందుతుంది. ఒకటిగా పోరాడుతుంది. ఒకటిగా గెలుస్తుంది.
మనల్ని అస్థిరపరచాలని శత్రువు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులు చేస్తోంది. మన అభివృద్ధిని అడ్డుకోవాలన్నది వారి కోరిక. అలజడుల ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు శత్రుదేశం ప్రయత్నిస్తోంది.
శత్రుదేశం ఎన్ని కుట్రలు పన్నినా భారత్‌ను ఏమీ చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశమంతా ఐక్యతను చాటాలి. వారి దుష్ట పన్నాగాలను తిప్పికొట్టటానికి మన దేశపౌరులందరూ శిలాసదృశంగా నిలబడాలి.
మన సైన్యం సామర్థ్యం మీద మాకు భరోసా ఉంది. కాబట్టి సైన్యం మనోస్థైర్యాన్ని ఏ శక్తీ దెబ్బతినేలా ఏదీ జరగకూడదు. మన మీద వేలెత్త గల అవకాశం మన శత్రువులకు దక్కకూడదు.
అన్ని రంగాల్లో మనం కష్టపడి పనిచేయాలి. దేశాన్ని పరిరక్షిస్తున్న వారి పట్ల భారతదేశం ఎంతో కృతజ్ఞతతో ఉంది. వారు అక్కడ ఉండటం వల్లనే దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోగలదు.’’
ఇవి కూడా చదవండి:
- వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ నుంచి భారత్ ఎలా తీసుకురావచ్చు
- నన్ను పాకిస్తాన్ సైన్యం బాగా చూసుకుంటోంది: పాక్ అదుపులో ఉన్న పైలట్
- పాకిస్తాన్ మీదుగా విమానాలు బంద్
- పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ ఏంటి? ఇమ్రాన్ ఖాన్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు?
- పాక్‌పై వైమానిక దాడులు చేసిన పైలట్లు వీరేనా
- పాక్‌లో వైరల్ అవుతున్న ఆ పైలట్ వీడియో బెంగళూరులోది
- ‘భారత్ నీళ్లను ఆయుధంలా ఉపయోగిస్తోంది’ - పాకిస్తాన్ ఆరోపణ
- మేం కూడా భారత్ పై దాడులు చేయగలమని చెప్పేందుకే విమానం కూల్చాం: ఇమ్రాన్ ఖాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)