You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇప్పుడు ప్రపంచ వింతలన్నీ దిల్లీలోనే చూడవచ్చు
గిజా పిరమిడ్ - లీనింగ్ టవర్ ఆఫ్ పీసా - ఐఫిల్ టవర్ - రోమన్ కలోసియమ్ - తాజ్ మహల్ - క్రైస్ట్ ది రిడీమర్ - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ... ఇవి ప్రపంచపు ఏడు వింతలు అని అందరికీ తెలుసు.
ఇవన్నీ చూడాలంటే... రోమ్ వెళ్లాలి, పారిస్ వెళ్లాలి, ఈజిప్ట్ వెళ్లాలి. ఇంకా చాలా చోట్లకే వెళ్లాలి. పైగా ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా.
కానీ ఇప్పుడా అవసరం లేదు అంటున్నారు దిల్లీలోని ఓ పార్క్ నిర్వాహకులు. దిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఓ పార్క్‌లో ఇవన్నీ ఒకేసారి, ఒకేచోట చూడవచ్చంటున్నారు.
అదే... వేస్ట్ టు వండర్ పార్క్.
గుజరాత్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్ సృజనాత్మక ఆలోచనకు ఇది ప్రతిరూపం. ఈ పార్క్ నిర్మాణం మొత్తం ఆయనే పర్యవేక్షించారు.
అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... ఈ ప్రపంచ వింతలన్నీ ఎన్నో టన్నుల వ్యర్థాలతో నిర్మించారు.
ఒక నిర్మాణానికి, మరో నిర్మాణానికి మధ్య దూరం కేవలం 200 మీటర్లే. అంటే అర గంటలో అన్ని ప్రపంచ వింతలూ చూసేయవచ్చన్నమాట.
ఇక్కడున్న గిజా పిరమిడ్ నిర్మాణానికి 12 టన్నుల వ్యర్థాలను వాడారు.
ఐఫిల్ టవర్ నిర్మాణానికి 15 టన్నుల వ్యర్థాలు అవసరమయ్యాయి. పీసా టవర్ కోసం 9 టన్నులు, రోమన్ కలోసియమ్ ఏర్పాటుకు 12 టన్నులు, తాజ్ మహల్ నిర్మాణానికి 12 టన్నులు, క్రైస్ట్ ది రిడీమర్ నిర్మాణానికి 5 టన్నులు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కోసం 8 టన్నుల వ్యర్థాలను ఉపయోగించారు.
రూ.4.5 కోట్లతో నిర్మించిన ఈ పార్క్ 5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ మొత్తం నిర్మాణానికి 6 నెలలు పట్టింది.
ఈ నెలాఖరుకు ఇది ప్రారంభమవుతుంది.
ఇవి కూడా చదవండి.
- ప్రపంచంలోని ఈ వింత శిక్షల గురించి మీకు తెలుసా?
- విక్రాంత్: రక్షణ కోసం భారత్ సిద్ధం చేస్తున్న బ్రహ్మాస్త్రం
- రూపాయి నోటుకు వందేళ్లు
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- మొట్టమొదటి మెట్రో ఎప్పుడు మొదలైందో తెలుసా!
- BBC Special: తాజ్‌మహల్: ‘జాగ్రత్తపడకపోతే... జ్ఞాపకమే మిగులుతుంది’
- కోతుల బెడద: నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం
- హైదరాబాద్‌కు 500 ఏళ్లు: ఎక్కడ మొదలైంది? ఎలా ఎదిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)