పుల్వామా దాడి: సీఆర్పీఎఫ్ జవాన్లకు భారత ప్రజల అశ్రు నివాళి

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మిలిటెంట్ల ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించేందుకు వేలాది మంది భారత ప్రజలు తరలి వచ్చారు.

శ్రీనగర్ సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో నలభైకి పైగా పారా మిలటరీ పోలీసులు హతమయ్యారు.

ఈ దాడికి పాల్పడింది తామేనని జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ప్రకటించింది.

భారత ప్రభుత్వం ఈ దాడికి నిరసనగా పాకిస్తాన్ మీద రకరకాల ఆర్థిక ఆంక్షలు విధించింది. పాకిస్తాన్‌కు "మోస్ట్ ఫేవర్డ్ నేషన్" హోదాను తొలగించింది. కస్టమ్స్ సుంకాన్ని 200 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ పాకిస్తాన్‌లోనే ఉన్నప్పటికీ, ఈ దాడితో తమకు ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.

ముస్లింల జనాభా అధికంగా ఉన్న కశ్మీర్ తమదేనని భారత్, పాకిస్తాన్‌లు చెబుతున్నాయి. కానీ, కశ్మీర్‌లో కొంత భాగం భారత్ నియంత్రణలో ఉంటే, మరికొంత భాగం పాకిస్తాన్ నియంత్రణలో ఉంది.

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళానికి (సీఆర్పీఎఫ్) జవాన్ సుఖ్‌జిందర్ సింగ్ శవ పేటిక వద్ద ఆయన బంధువులు విషాదంలో కూరుకుపోయిన దృశ్యమిది. పంజాబ్ రాష్ట్రంలోని టార్న్ టరన్ జిల్లాలోని గండివిండ్ గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

ఆగ్రాలో సీఆర్పీఎఫ్ జవాన్ కౌశల్ కుమార్ రావత్ అంత్యక్రియలు.

మరణించిన తమ సహచరులకు భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సీఆర్పీఎఫ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లు.

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో తమ సహోద్యోగి బబ్లూ సాంట్రాకు (ఎగువ) గౌరవ వందనం చేస్తున్న సీఆర్పీఎఫ్ అధికారులు. బౌరియా గ్రామంలో తన కుమారుడి కోసం విలపిస్తున్న బబ్లూ తల్లి (పైన కుడి).

కోల్‌కతా విమానాశ్రయంలో సుదీప్ బిశ్వాస్, బబ్లూ సాంట్రాలకు గౌరవ వందనం చేస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది.

దిల్లీలో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 70 వేల మంది 'బ్రిటిష్-ఇండియన్ ఆర్మీ' సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన ఇండియా గేట్ వద్ద పుల్వామా మృతులకు నివాళులు అర్పిస్తున్న ప్రజలు.

అలహాబాద్‌లో గంగా నదీ తీరానికి చేరుకున్న మహేశ్ కుమార్ మీనా (ఎగువ) అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన జన సందోహం.

సీఆర్పీఎఫ్ జవాన్ తిలక్ రాజ్ మృతదేహం కోసం ధర్మశాలకు 90 కిలోమీటర్ల దూరంలోని ధేవా జాండ్రోహ్‌లోని ఆయన స్వగ్రామంలో నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు. ఊరి ప్రజలు.

జమ్మూలో కర్ఫ్యూ... కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)