You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రామమందిర నిర్మాణం కోరుతూ కువైట్ షేక్ పాట వెనుక అసలు నిజం - ఫ్యాక్ట్ చెక్
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీం
- హోదా, బీబీసీ న్యూస్
భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఎదుట ఒక కువైట్ షేక్ రామ మందిరం నిర్మాణం కోరుతూ పాట పాడినట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది.
ఈ వీడియోను కొన్ని వేల మంది లైక్ చేశారు. 'ఇది తప్పనిసరిగా చూడాల్సిన వీడియో. కువైట్ షేక్ ముబారక్ అల్ రషీద్ రామమందిర నిర్మాణం కోరుతూ పాడిన పాట ఇది' అంటూ వేల మంది షేర్ చేశారు.
అరబ్ ప్రజల్లా దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి సుష్మా ఎదుట ఈ పాట పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
''రాముడికి చెందనివారు ఎవరైనా నాకు వారితో పనిలేదు.. చెప్పండి.. రామమందిరాన్ని ఎప్పుడు నిర్మిస్తారో' అంటూ ఆయన పాడుతున్నట్లుగా ఉంది అందులో.
అయితే, మా పరిశోధనలో ఈ వీడియోలో ఉన్నది నిజం కాదని తేలింది. ఇది కొందరు తమకు అనుకూలంగా ఉండేలా మార్చేసిన వీడియోగా తేలింది.
నిజానికి ఇది 2018లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడు కూడా అది నిజం కాదని తేలింది. కానీ.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో అది వేలాది మందికి చేరింది.
వాస్తవమేంటి?
ఈ వీడియోను 2018 అక్టోబరు 30న తీశారు. కువైట్‌లోని భారతీయ సమాజంతో సుష్మా స్వరాజ్ సమావేశమైనప్పు నిర్వహించిన కార్యక్రమంలోని వీడియోగా 'డీడీ న్యూస్' దీన్ని ప్రసారం చేసింది.
కువైట్ గాయకుడు ముబారక్ అల్ రషీద్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఆయన ఆ కార్యక్రమంలో రెండు బాలీవుడ్ పాటలు పాడారు.
ఆ తరువాత మహాత్మాగాంధీకి ఇష్టమైనదిగా చెప్పే 'వైష్ణవ్ జన్ తో తేనే కహియే జే' శ్లోకాన్ని ఆలపించారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ కూడా ఈ వీడియోను ఆ మరునాడు అంటే అక్టోబర్ 31, 2018న ట్వీట్ చేశారు.
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రపంచంలోని 124 దేశాలకు చెందిన గాయకులు ఆ శ్లోకాన్ని ఆలపించి పంపించారు. అందులో ముబారక్ అల్ రషీద్ కూడా ఉన్నారని సుష్మాస్వరాజ్ చెప్పారు.
కువైట్‌లో ఆ గాయకుడు గత ఏడాది సుష్మ ఎదుట ఆలపించిన శ్లోకం బదులుగా రామమందిరం పాటను ఎవరో మార్చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తప్పుడు వీడియో ఇప్పుడు షేర్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
- FACT CHECK: పశ్చిమ బంగలో 'ముస్లిం తీవ్రవాదం' వీడియో వెనుక అసలు నిజం
- Fact Check: లండన్లో భారత గణతంత్ర దినోత్సవం, వైరల్ వీడియో వెనుక అసలు నిజం
- Fact Check: రాహుల్ గాంధీ పట్నా ర్యాలీలో బిహార్ యువతను అవమానించారా...
- భారత్లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్: 13 ఏళ్లు గడిచినా ఇంకా కేసు చిక్కు ముడి వీడలేదు
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)