ఇందిరాగాంధీ: జననం నుంచి మరణం దాకా

1916

ఫిబ్రవరి 8న జవహర్ లాల్ నెహ్రూ(26), కమల(17)ల వివాహం జరిగింది.

1917

నవంబర్ 19న నెహ్రూ, కమల దంపతుల ఇంట ఇందిర పుట్టారు.

1924

అలహాబాద్‌లోని ఆనంద్ భవన్‌లో ఇందిర బాల్యం గడిచింది. 1924 నవంబర్‌లో ఇందిరకు తమ్ముడు పుట్టాడు కానీ రెండు రోజులకే చనిపోయాడు.

1931

మోతీలాల్ నెహ్రూ మరణించారు. ఇందిరను పుణెలోని బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు.

1942

మార్చి 26న ఇందిరకు ఫిరోజ్ గాంధీతో వివాహం అయింది. అదే ఏడాది ఇందిర తన పొడవాటి జడను తొలిసారి కట్ చేసుకున్నారు.

1944

ఇందిర, ఫిరోజ్‌లకు మొదటి సంతానం రాజీవ్ జన్మించారు. 1946 నవంబర్‌లో ఇందిర కుటుంబం లక్నో వెళ్లింది. 1946లో రెండో కుమారుడు సంజయ్ పుట్టారు.

1959

కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. 1964 నుంచి 1966 వరకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రిగా చేశారు.

1966

కాంగ్రెస్ నుంచి ఎవరు ప్రధానమంత్రి పదవి చేపట్టాలనే అంశంపై ఓటింగ్ జరిగింది. ఇందిరకు 355 ఓట్లు రాగా, దేశాయ్‌కి 169 ఓట్లు వచ్చాయి. ఇందిర తనను తాను దేశ సేవకురాలిగా ప్రకటించుకున్నారు.

1968

ఈ ఏడాదిలోనే దేశంలో హరిత విప్లవం మొదలైంది. వ్యవసాయానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

1971

ఎన్నికల్లో ఇందిరగాంధీ గరీబీ హఠావో నినాదాన్నిచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది. తర్వాత కాలంలో ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు.

1975

ఇందిర గాంధీ దేశంలో అత్యయికస్థితిని విధించారు. ఆమె పాలన వివాదాస్పదమైంది. అప్రతిష్టను మూటగట్టుకుంది.

1977

ఎన్నికల్లో ఇందిర ఓడిపోయారు. మొరార్జీ దేశాయి తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

1980

ఇందిరా గాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చారు.

1984

అక్టోబర్ 31న ఇందిర ఆంతరంగిక భద్రతా సిబ్బందిలోని ఇద్దరు సిక్కు సైనికులు ఆమెను కాల్చిచంపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)