You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మదన్‌లాల్ ఖురానా: 'దిల్లీ కా షేర్' కన్నుమూత
బీజేపీ నేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా శనివారం అర్థరాత్రి మృతిచెందారు.
బీజేపీ దిల్లీ యూనిట్ ఆయన మృతిని ధ్రువీకరించింది. 82 ఏళ్ల ఖురానా రాత్రి 11 గంటలకు కీర్తినగర్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఖురానా మృతికి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ట్విటర్‌లో నివాళులు అర్పించారు.
మదన్‌లాల్ ఖురానా కుమారుడు దిల్లీ బీజేపీ ప్రతినిధి హరీష్ ఖురానా, తండ్రి అంత్యక్రియలు ఈరోజు 3 గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్‌లో నిర్వహిస్తామని తెలిపారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, హర్షవర్ధన్ రాణే, విజయ్ గోయెల్ కూడా ఖురానా మృతికి ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు.
ఖురానా పార్థివ దేహాన్ని అంతిమదర్శనం కోసం ఆదివారం 12 గంటలకు 14, పండిత్ మార్గ్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉంచుతామని దిల్లీ బీజేపీ ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గా తెలిపారు.
మదన్‌లాల్ ఖురానా 1993 నుంచి 1996 వరకూ దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో ఆయన కొన్ని నెలలు రాజస్థాన్ గవర్నర్‌గా కూడా ఉన్నారు.
మదన్‌లాల్ ఖురానా 1936లో ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న ఫైసలాబాద్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం దిల్లీలోని కీర్తి నగర్‌లో ఒక రెఫ్యూజీ కాలనీలో స్థిరపడింది.
1965 నుంచి 1967 వరకు ఆయన జన్‌సంఘ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 90 దశకంలో బీజేపీ దిల్లీ యూనిట్‌కు కీలక నేతగా మారారు. కార్యకర్తలు ఆయన్ను 'దిల్లీకా షేర్' అని పిలుచుకునేవారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో కాల్పులు: యూదుల ప్రార్థనాస్థలంలో పలువురి మృతి
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
- నమ్మకాలు - నిజాలు: అలర్జీలు ఆడవాళ్లకేనా?
- సీబీఐ కేసు: ఎవరీ జస్టిస్ పట్నాయక్?
- ‘వైద్యుల్లో సగం మంది ఆదాయ పన్ను కట్టలేదు’
- నూర్ ఇనాయత్ ఖాన్: భారతీయ యువరాణి... బ్రిటన్ కీర్తించే గూఢచారి
- పాకిస్తాన్: హాఫీజ్ సయీద్ సంస్థలపై తొలగిన నిషేధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)