You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విరాట్ కోహ్లి: వన్డేల్లో శరవేగంగా 10 వేల పరుగులతో కొత్త రికార్డ్
విశాఖపట్నంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మైలు రాయిని అందుకున్నాడు.
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.
పదివేలకు 81 పరుగుల దూరంలో ఉండగా విరాట్ విశాఖలో ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
అంతకు ముందు 212 వన్డేల్లో 58.69 సగటుతో 9,919 పరుగులు చేశాడు.
వీటిలో 36 శతకాలు ఉన్నాయి.
తాజా మ్యాచ్‌లోనూ విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. 157 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారత్ ఆరు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. వెస్టిండీస్ కూడా ఏడు వికెట్లు నష్టపోయి ఇవే పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
అయిదు మ్యాచ్‌ల సీరీస్‌లో 1-0 తో భారత్ ముందంజలో ఉంది.
వన్డేల్లో వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్
1. విరాట్ కోహ్లి - 213 మ్యాచ్‌లు
2. సచిన్ తెందూల్కర్ - 266 మ్యాచ్‌లు
3. సౌరవ్ గంగూలి - 272 మ్యాచ్‌లు
4. రికీ పాంటింగ్ - 272 మ్యాచ్‌లు
5. జాక్వెస్ కలిస్ - 286 మ్యాచ్‌లు
పదివేల పరుగుల ఘనతను సచిన్ 266 మ్యాచ్‌లలో సాధించగా.. విరాట్ 213 మ్యాచుల్లోనే సాధించాడు.
ఇవి కూడా చదవండి:
- నడుస్తున్న కాలానికి నాయకుడు
- ఆఖరు బంతికి సిక్సర్: మియాందాద్ నుంచి దినేశ్ కార్తీక్ దాకా
- ప్రొఫెసర్ డీఎన్ ఝా: హిందూమతం అంటే ఏమిటి? భారత్ ఎప్పుడు 'మాత' అయింది? చరిత్ర ఏం చెప్తోంది?
- తప్పు చేసిన వారెవరూ ఇక తప్పించుకోలేరు: తెలంగాణ పోలీసు శాఖలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ
- BBC SPECIAL: ‘దేశంలో అతిపెద్ద మారణకాండను నేను ఆరోజే చూశాను’
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)