You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచయుద్ధంలో మునిగిపోయిన చమురు ట్యాంకర్‌తో పెనుముప్పు
బాల్టిక్ సముద్ర గర్భంలో ఇప్పుడో పెను ముప్పు పొంచి ఉంది.
రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో నాజీ జర్మన్ ట్యాంకర్ 'ద ఫ్రాంకెన్'ను రష్యా యుద్ధవిమానాలు పోలండ్ తీరంలో ముంచేశాయి. ఈ ట్యాంకర్ సముద్రం అడుగున 70 మీటర్ల లోతులో ఉంది. ట్యాంకర్‌లో సగం వరకు చమురు ఉంది.
సుమారు 3 వేల టన్నుల చమురుతో వెళ్తున్న ఈ ట్యాంకర్ మునిగిపోయేటప్పుడు సగం మేర చమురు ఆహుతైపోయింది.
ప్రస్తుతం ఇది తుప్పు పట్టడం వల్ల ట్యాంకర్ రెండుగా విరిగిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదం నివారణకు ప్రయత్నాలు
ట్యాంకర్ హల్ భాగం దెబ్బతింటోందని తెలుస్తోంది. దీనిని శుభ్రపరిచి, ప్రమాదాన్నినివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
లోగడ ఒక చిన్న నౌకలోంచి లీకేజీ జరిగి పర్యావరణంపరంగా తీవ్రమైన నష్టం వాటిల్లింది.
ఫ్రాంకెన్ వల్ల అనుకోనిది జరిగితే అంతకంటే తీవ్రమైన పర్యావరణ విపత్తు సంభవిస్తుంది.
సముద్రానికి, అందులోని ప్రాణులకు, బీచ్‌లకు, జనావాసాలకు పెద్ద సమస్యే తలెత్తుతుంది.
ఇవి కూడా చదవండి:
- ‘ఎథికల్ సఫారీ’లు ఈ డాల్ఫిన్లను బతికిస్తాయా?
- చౌక స్మార్ట్ ఫోన్‌తో ‘చేపల వేట’
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- గ్రీన్‌ల్యాండ్: ఊరిని భయపెడుతున్న భారీ ఐస్‌బర్గ్
- వైసీపీ ఎంపీల రాజీనామాలు: ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఎందుకు పెట్టలేదు?
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- భారత్‌లో షాడో బ్యాంకింగ్ సంక్షోభం.. రూ.88504 కోట్ల అప్పుల్లో ఐఎల్ఎఫ్ఎస్
- ఒకనాటి ఐ.ఎస్. లైంగిక బానిస... నేటి నోబెల్ శాంతి బహుమతి విజేత
- అభిప్రాయం: ‘శబరిమల తీర్పు’ సరే... మరి మన ఇళ్లల్లో ఆ నిషేధం పోయేదెన్నడు?
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- 55 ఏళ్ల తర్వాత భౌతిక శాస్త్రంలో మహిళకు నోబెల్ ప్రైజ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)