వాజ్‌పేయి: ‘వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం..’ అరుదైన ఆడియో ఇంటర్వ్యూ

అధికారం ఎవరి చేతికి వస్తుందనేది ముఖ్యం కాదు, భారత దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదనేది ముఖ్యమైన విషయం అని బీబీసీ హిందీ రేడియో ప్రతినిధి కైలాస్ బుధ్వార్‌కి 1981లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని వాజ్‌పేయి తెలిపారు.

అధికార మార్పిడి మాత్రమే జరిగితే సరిపోదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ వ్యక్తి లేదా పార్టీ కాకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందన్నారు.

పాత వ్యవస్థలు, పురాతన విశ్వాసాలు మాయమవుతున్నాయన్నారు. కొత్త వ్యవస్థ కోసం, నవ భారతం కోసం మనమంతా పోరాడాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)