You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళ వరదలు: 73 మంది మృతి, రాష్ట్రమంతటా ‘రెడ్ అలర్ట్’
కేరళలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకూ 73 మందికి పైగా మృతి చెందారు. 85 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క బుధవారం నాడే 25 మంది మరణించారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వరద పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కోచిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 వరకూ మూసేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
వరద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి పీహెచ్ కురియన్ బీబీసీతో "వరదల్లో చాలా మంది చిక్కుకుపోయారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రాత్రి వారిని చేరుకోవడం కాస్త కష్టంగా ఉన్నా, పగలు మాత్రం సహాయక కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. సైన్యం చాలా సాయం అందిస్తోంది" అని చెప్పారు.
ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని కురియన్ తెలిపారు.
పొంచి ఉన్న ప్రమాదం
"రాష్ట్రంలో గత 10-12 రోజుల నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కేరళలో ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలాంటి వరదలు రాలేదు" అని బీబీసీ ప్రతినిధి ప్రవీణ్ అన్నామలై తెలిపారు.
కేరళ ఉత్తర జిల్లాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు గురువారం వరకూ సెలవులు ప్రకటించారు.
లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే వర్షాలు పూర్తిగా ఆగిపోయేవరకూ ప్రమాదం తప్పేలా కనిపించడం లేదు.
‘కేంద్రం అండగా ఉంటుంది’: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ వరదలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని ట్వీట్ చేశారు.
ప్రధాని తన ట్వీట్‌లో "రాష్ట్రంలో వరద పరిస్థితి గురించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో వివరంగా చర్చించాను. వరదలో చిక్కుకున్న ప్రజలకు కేంద్రం అండగా నిలుస్తుంది. ఎలాంటి సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉంది. కేరళ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా" అని ట్వీట్ చేశారు.
‘విషాదంలో కేరళ’: రాహుల్
కేరళ వరదలపై రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. కేరళ రాష్ట్రం విషాదంలో మునిగిపోయిందన్నారు. ‘‘కేరళ వరదలపై ప్రధానితో మాట్లాడాను. ఆర్మీ, నేవీ దళాలను పెద్దఎత్తున కేరళకు పంపాలని ఆయనను కోరాను’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఈమె భారత్-పాక్ ప్రేమికుల్ని కలిపారు, అత్యాచార బాధితుల్ని స్వదేశాలకు చేర్చారు
- ఉగ్రవాద వ్యతిరేక తొలి భారతీయ మహిళా దళం
- జాతీయ పతాక రూపకర్తగా పింగళి వెంకయ్య పేరు ‘అధికారికంగా’ కనిపించదెందుకు?
- ఇస్రో: 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్ట్ సారథి లలితాంబిక
- వీడియో గేమ్స్ ఆడిన అనుభవంతో విమానం ఎత్తుకెళ్లాడు
- మీ పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?
- పగలు లాయర్లు... రాత్రుళ్లు బార్లో ‘డ్రాగ్’ డాన్సర్లు
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
- ట్రిపుల్ తలాక్: బిల్లు సవరణపై ఎవరికి కోపం, ఎవరికి సంతోషం?
- ‘గమనిక... మేం స్వచ్ఛందంగా పడుపు వృత్తిని మానేస్తున్నాం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)