You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వైరల్: పాకిస్తాన్‌లో భద్రతపై తీసిన ఈ వీడియో భారత్‌లో హత్యకు కారణమైంది. ఇలా..
(హెచ్చరిక: ఈ వీడియోలో కలవరపరిచే దృశ్యాలు ఉన్నాయి.)
ఒక చిన్నారిని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని చూపే ఒక వీడియో భారత్‌లో వైరల్ అవుతోంది. ఇది ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేవారేమోననే అనుమానంతో కొత్తవారిపై స్థానికులు దాడులు కూడా చేశారు.
చిన్నారి కిడ్నాప్ అయినట్లు కనిపిస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్నది మాత్రమే నిజం కాదు. వాస్తవానికి ఇది పాక్‌లో భద్రతపై తీసిన వీడియోలోని ఒక భాగం. చిన్నారిని 'కిడ్నాపర్' తర్వాత అక్కడే వదిలిపెట్టాడు. 'కరాచీ వీధుల్లో పిల్లలను కిడ్నాప్ చేయడానికి క్షణం చాలు' అనే సందేశాన్ని అతడు చూపించాడు.
ప్రాణం తీసిన ఫేక్ ‘న్యూస్’ వీడియో
భారత్‌లో ఈ వీడియోలోని రెండో భాగాన్ని తొలగించారు. ఇలాంటి వీడియోలు వాట్సప్‌లో చక్కర్లు కొట్టాయి. ఎడిట్ చేసిన వీడియోలను చూసినవారు భయాందోళనకు గురయ్యారు. ప్రాంతీయ వార్తాఛానళ్లు చేసిన పని సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఛానళ్లు ఈ వీడియోలను చూపిస్తూ ఐదు వేల మంది కిడ్నాపర్లు దక్షిణ భారత్‌లోకి వచ్చారని ప్రజలను హెచ్చరించాయి.
లోగడ 26 ఏళ్ల కాలూ రామ్ ఉఫాధి కోసం బెంగళూరుకు వచ్చాడు. కొందరు స్థానికులు అతడిని పిల్లల కిడ్నాపర్ అనుకున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి క్రూరంగా కొట్టారు. వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకునేలోపు అతడు చనిపోయాడు.
చిన్నారి కిడ్నాప్ అయినట్లు చూపిస్తున్న వీడియో నిజమైనది కాదని పోలీసులు నిర్ధరించారు. వదంతులకు వ్యతిరేకంగా బెంగళూరు పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.
మీడియా ఇలాంటి వార్తలను వ్యాప్తి చేసే ముందు నిర్ధరించుకోవాలని బెంగళూరు పోలీసు కమిషనర్ టి.సునీల్ కుమార్ కోరారు.
బూటకపు వార్తలు ప్రాణాలు కూడా తీయగలవనేందుకు బెంగళూరు ఘటన ఒక ఉదాహరణ.
ఇవి కూడా చదవండి:
- తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల్లో 60 మంది విద్యార్థుల ఆత్మహత్య
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- 2017లో ఎక్కువ మంది వాడిన పదమేంటో తెలుసా?
- ఫేస్‌బుక్ మోడరేటర్: చూడలేనివెన్నో అక్కడ చూడాల్సి ఉంటుంది!
- ‘బ్లూ వేల్’ బూచి నిజమేనా?
- ప్రపంచం అంతమైపోతుందా? ఎవరు చెప్పారు?
- ఫేస్బుక్లో ‘డౌన్‌వోట్’ త్వరలో!!
- ప్రాణాంతకంగా మారుతున్న సెల్ఫీ మోజు: ఇక ఆంక్షలే మార్గమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)