You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లబ్‌డబ్బు: మీ ఇల్లు బంగారం కానూ!
తరాలు మారుతున్నాయి.. రాజుల కాలం నుంచి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించే స్థాయికి ఎదిగాం. కానీ నాటికి నేటికీ ఎప్పటికీ మెరిసిపోతూ.. విలువ తగ్గనిది మాత్రం బంగారం.
ఏదైనా గొప్ప పని చేస్తే రాజుల కాలంలో బంగారాన్ని బహుమతిగా ఇచ్చేవారు. ఈ రోజుకీ "గోల్డ్ మెడల్" అంటూ బంగారాన్ని బహుమతిగా ఇస్తారు. అంతే కాదు బంగారు ఆభరణాల పై మక్కువ ఇంకా ప్రజలలో తగ్గలేదు.
అయితే ఈ బంగారు ఆభరణాల కొనుగోలు సమయంలో చాలా సార్లు మోసపోయే ప్రమాదముంది. అలాంటి టైం లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం ఈ వారం లబ్ డబ్బులో.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అని ఎవరైనా జువెల్లర్ మీతో అంటే.. అతను అబద్ధం ఆడుతున్నట్టే లెక్క. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం అంటే అత్యంత శుద్ధమైన బంగారం. ఇంత శుద్ధమైన బంగారం చాలా మృదువు గా ఉంటుంది. దీంతో ఆభరణాలు చేయడం కుదరదు.
బంగారు ఆభరణాలు తయారు చేయాలంటే 22 క్యారెట్ల బంగారం అవసరం . ఇందులో 91.6% బంగారం ఉంటుంది. ఈ బంగారాన్ని ఆభరణాలుగా మలిచేందుకు కొద్దిగా గట్టిపడేలా చేయాలి. దాని కోసం వెండి, జింక్, కాడ్మియం ఉపయోగిస్తారు.
మీకు ఎంత క్యారట్ బంగారం కావాలో ముందు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆభరణాలు ఎన్ని క్యారట్లు ఉన్నాయో దాని మీదే ఆ బంగారు ధర ఆధారపడి ఉంటుంది.
బంగారం కొనే ముందు దాని నాణ్యతను తప్పకుండా పరిశీలించాలి. హాల్ మార్క్ ఉంటేనే బంగారం కొనడం మంచిది. ఎందుకంటే Bureau of Indian Standards అనే ప్రభుత్వ సంస్థ.. వస్తువుల నాణ్యతను పరిశీలించి ఈ హాల్ మార్క్ ను ఇస్తుంది. ఈ హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని నిరభ్యంతరంగా కొనచ్చు.
అయితే రకరకాల క్యారట్ల బంగారానికి రకరకాల హాల్ మార్క్ నెంబర్‌లు ఇస్తారు. దీని వల్ల లాభాలేంటంటే, మీరొకవేళ బంగారాన్ని అమ్మాలని అనుకుంటే మీ బంగారంపై విలువ తగ్గదు. అంటే బంగారం అసలు ధర ఎంతుందో అంత ధర మీకు లభిస్తుంది.
అయితే ఆ ధరను ఎలా నిర్ణయిస్తారు?
దీనికి కొద్దిగా లెక్కలు అవసరం.
క్యారట్ గోల్డ్ అంటే 1/24 శాతం గోల్డ్. అంటే 24 క్యారట్ల బంగారం ధర 27,000 రూపాయలైతే 22 క్యారట్ల బంగారం ధర 24,750 రూపాయలవుతుంది.
ఇపుడు బంగారు ఆభరణాల ధరల గురించి మాట్లాడుదాం. జువల్లరీ ధరలు లెక్కించే ఫార్ములా కూడా చాలా సింపుల్ . ఆభరణాల ధర నిర్ణయించేటపుడు బంగారం ధర, ఆభరణాల తయారీ చార్జీ, జీఎస్టీ కలపాల్సి వస్తుంది.
సో ఇదీ బంగారం కథ. ఈ సారి నుంచి బంగారం, లేదా బంగారు ఆభరణాలు కొనే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)