యెమెన్‌లో మానవీయ సంక్షోభం: 84 లక్షల మంది ఆకలి బాధితులు

ఫొటో సోర్స్, Reuters
అరబ్ ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన యెమెన్‌లో మానవీయ సంక్షోభం ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనదిగా మారిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దేశంలో సాగుతున్న అంతర్యుద్ధం, దాని ఫలితంగా తీవ్రమైన కరవుకాటకాల మూలంగా 2015 నుంచి 9 వేల మంది చనిపోయారు. 50 వేల మంది గాయాల పాలయ్యారు. రెండు కోట్ల 20 లక్షల మంది అంటే ఆ దేశ జనాభాలో 75 శాతం ప్రజానీకం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఎనభై లక్షల మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. దాదాపు నాలుగు లక్షల మంది అయిదేళ్ళ లోపు పసివారు పోషకాహారం లేక ప్రాణాలు కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
ఎందుకీ దుస్థితి? ఎవరిదీ పాపం? ఏమిటి పరిష్కారం? బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)