You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జననం నుంచి మరణం వరకు... శ్రీదేవి జీవిత విశేషాలు ఇవీ...
ప్రముఖ సినీ నటి శ్రీదేవి శనివారం రాత్రి కన్ను మూశారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన ఆమె, కార్డియాక్ అరెస్టుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు 54 సంవత్సరాలు. శ్రీదేవి జీవిత విశేషాలు క్లుప్తంగా...
శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. నాలుగేళ్ల వయసులో తొలిసారి ఆమె 'తునైవన్' అనే తమిళ సినిమాలో నటించారు. బాలనటిగా ఆమె పలు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించారు.
హీరోయిన్‌గా ఆమె నటించిన తొలి సినిమా 'మూండ్రు ముడిచ్'. దక్షిణాది భాషల్లో, హిందీలో శ్రీదేవి నటించిన అనేక సినిమాలు ఘన విజయం సాధించాయి. 1980వ దశకంలో ఆమె వెండితెరపై ఓ వెలుగు వెలిగారు.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రశ్రేణి నటుల సరసన శ్రీదేవి నటించారు.
'జుదాయి' అనే హిందీ సినిమా తర్వాత పదిహేనేళ్లపాటు శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు. 'ఇంగ్లిష్-వింగ్లిష్' సినిమాతో 2012లో మళ్లీ తెరపైకి వచ్చారు.
ఆమె నటించిన 'మామ్' చిత్రం నిరుడు విడుదలైంది.
శ్రీదేవి 1996లో సినీ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి, బోనీకపూర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు జాహ్నవి, ఖుషీ.
సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2013లో ఆమెకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందించి, సత్కరించింది.
ఇవి కూడా చదవండి:
- శ్రీదేవి మరణం: ‘వసంత కోకిల’ వెళ్లిపోయింది..!
- శ్రీదేవి ఇకలేరు: నేనొక మంచి ఫ్రెండ్‌ని కోల్పోయా!
- స్లిమ్‌గా కనిపించే శ్రీదేవిని కార్డియాక్ అరెస్ట్ ఎలా కబళించింది?
- శ్రీదేవి ఇకలేరు: ‘జాబిలమ్మ శాశ్వతంగా నిద్రపోయింది’
- సినిమా అమ్మ.. ఇకపై కాదు కన్నీటి బొమ్మ
- 'అతిలోక సుందరి' నుంచి నేనెంతో నేర్చుకున్నా: చిరంజీవి
- 'కళ్లతో శ్రీదేవి పలికించిన హావభావాల్ని ఎలా మర్చిపోగలం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)