You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోచి షిప్‌యార్డ్‌లో పేలుడు; ఐదుగురి దుర్మరణం
కేరళలోని కోచి షిప్‌యార్డ్‌లో మంగళవారం పేలుడు సంభవించడంతో ఐదుగురు చనిపోయారు.
కోచి నౌకాశ్రయంలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన నౌకలో ఈ పేలుడు చోటుచేసుకొంది. దట్టమైన పొగ వల్ల ఊపిరాడక ఈ ఐదుగురు మృతిచెందారని అధికారులు చెప్పారు.
నౌకలోని మిగతా అందరినీ కాపాడినట్లు బీబీసీ ప్రతినిధి అష్రాఫ్ పడానాకు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు.
కాపాడిన క్షతగాత్రుల్లో ముగ్గురు కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
పేలుడు సంభవించిన నౌక దేశంలోని అతిపెద్ద చమురు అన్వేషణ సంస్థ 'ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)'కు చెందినది. ఈ నౌక తవ్వకం పనులను చేపడుతుంటుంది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోచి షిప్‌యార్డులో దేశంలోని పలు భారీ నౌకలకు మరమ్మతులు జరుగుతుంటాయి.
ఇవి కూడా చదవండి:
- BBC Exclusive: ఒకప్పుడు తాలిబాన్.. ఇప్పుడు కార్పెంటర్!
- #గమ్యం: ఎప్పటికీ వన్నె తరగని హోటల్ మేనేజ్మెంట్
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
- బీజేపీ ఫేస్‌బుక్ పేజీలో ఏపీ నెటిజన్ల నిరసనలు
- బడ్జెట్ 2018: తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారు?
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)