You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఆప్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు చట్టవిరుద్ధంగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారు కాబట్టి వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్టు మీడియా కథనాలు తెలుపుతున్నాయి.
నిజానికి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలపై లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే వీరిలో జర్నైల్ సింగ్ రాజీనామా చేయడంతో వీరి సంఖ్య 20 అయ్యింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జోతి జనవరి 23న రిటైర్ కానున్నారనీ, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రుణం తీర్చుకోవడం కోసమే ఈ చర్య తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దిల్లీ ఎమ్మెల్యే సౌరభ్ భారద్వాజ్ ఆరోపించారు. "దీనిపై మేం హైకోర్టులో అపీల్ చేస్తాం" అని ఆయన తెలిపారు.
"ఈ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ బంగ్లాలు ఉన్నట్టు ఎవరైనా చూశారా? ఎవరి బ్యాంక్ స్టేట్‌మెంటైనా చూశారా? అసలు ఈ ఎమ్మెల్యేలకు తమ వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదు" అని ఆప్ నేత అన్నారు.
ఇంకా సౌరభ్ భారద్వాజ్ ఏమన్నారు?
- 21 మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉన్నారంటూ రాష్ట్రపతికి అసలెవరైనా ఫిర్యాదు చేశారా?
- లాభదాయక పదవుల ఆరోపణే తప్పు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంచి విచారణా చేయలేదు. దీనిపై విచారణ జరపొచ్చా లేదా అనే అంశంపై చర్చ మాత్రమే జరిగింది. అప్పుడు దీనిపై విచారణ జరపాలి అన్న నిర్ణయం మాత్రమే జరిగింది.
- ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఎవరికైనా ప్రభుత్వ బంగళాలు, వాహనాలు ఉన్నాయా? ఆ ఎమ్మెల్యేలకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదు.
- మోదీ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అచల్ కుమార్ జోతి జనవరి 23న పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. సోమవారం నాడు ఆయన రిటైర్ కానున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జోతి ఒక్కరే తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన తన నిర్ణయాన్ని ఏకపక్షంగా రుద్దాలనుకుంటున్నారు. ఎందుకంటే మరో మూడు రోజుల్లో ఆయన పదవీకాలం ముగుస్తోంది.
- ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థ గౌరవాన్ని మంట గలుపుతూ మోదీ రుణం తీర్చుకోవాలని జోతి భావిస్తున్నారు.
- ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శులుగా లేరని హైకోర్టు స్పష్టం చేస్తుండగా వారిపై ఎన్నికల సంఘం ఎలా విచారణ జరుపుతుంది?
కేజ్రీవాల్‌కు అధికారంలో కొనసాగే లేదు: కాంగ్రెస్
"కేజ్రీవాల్‌కు అధికారంలో కొనసాగే హక్కు లేదు. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగుతున్న 20 మంది ఆప్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే. లోక్‌పాల్ ఎక్కడుంది? ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని ఆసరా చేసుకొని విదేశీ పర్యటనలు చేస్తున్నారు" అని దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకన్ వ్యాఖ్యానించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన కపిల్ మిశ్రా కూడా ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు.
ప్రలోభాలకు గురై గుడ్డివాడిగా మారినందుకు కేజ్రీవాల్‌కు మూల్యం చెల్లించాల్సి వస్తోందంటూ ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్: శత్రువును ప్రేమతో ఉచ్చులో పడేసే 'మొసాద్' మహిళా గూఢచారి కథ
- #metoo బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- #MeetToSleep: దిల్లీ అమ్మాయిలు పార్కుల్లో ఒంటరిగా ఎందుకు పడుకుంటున్నారు?
- వివాదాల్లో చిక్కుకున్న అందగత్తెలు
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- మహిళలపై మగ పోలీసుల చెయ్యెందుకు?
- నగ్నత్వాన్నే నిరసన రూపంగా ఆమె ఎందుకు ఎంచుకున్నారు?
- నన్నురేప్ చేశారంటే ఎవరూ నమ్మలేదు
- నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు
- థాయ్‌లాండ్‌లో పురుషాంగాన్ని తెల్లగా మార్చే చికిత్స