You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెన్సెక్స్: 22 రోజుల్లో 1000 పాయింట్లు
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బుధవారం స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. సెన్సెక్స్ తొలిసారి 35,000 పాయింట్లపైన ముగిసింది.
ఆరంభంలో కాస్త ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు మధ్యాహ్నం నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు.
ఉదయం 34,754 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 34,771-35,119 మధ్య చలించి చివరకు 311 పాయింట్ల లాభంతో 35,082 వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ సైతం కొనుగోళ్ల అండగా దూసుకెళ్లింది.
10,800 మార్కును తాకి వెనక్కి వచ్చింది. ఇంట్రాడేలో 10,667-10,803 మధ్య కదలాడి చివరకు 10,789 వద్ద స్థిరపడింది.
తగ్గిన ద్రవ్యలోటు భయాలు
ద్రవ్యలోటు నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్య మదుపర్లలో విశ్వాసం నింపింది.
ప్రభుత్వం గతంలో రూ.50,000 కోట్లు అదనంగా రుణం తీసుకోనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ మొత్తాన్ని రూ.20,000 కోట్లకు తగ్గించింది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై కొంత మేరకు భారం తగ్గే అవకాశం ఉంది.
ఈ విషయాలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ట్వీట్ చేశారు.
బీఎస్ఈ సంబరాలు
సెన్సెక్స్ 35,000 పాయింట్ల మైలురాయిని చేరిన సందర్భంగా బీఎస్ఈ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. బీఎస్ఈ ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఆశిష్ చౌహాన్, ఇతర సిబ్బంది కేక్ కోసి సంతోషాన్ని పంచుకున్నారు.
22 రోజుల్లోనే..
2017 డిసెంబరు 26న సెన్సెక్స్ 34,000 పాయింట్ల మైలురాయిని చేరుకుంది.
ఆ తరువాత 35,000 పాయింట్లను చేరుకోవడానికి తీసుకొన్న సమయం 22 రోజులు మాత్రమే.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)