You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్ ఎన్నికలు: మొరాయించిన 111 ఈవీఎంలు
గుజరాత్‌లో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ శనివారం ముగిసింది.
సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
పోలింగ్‌కి సంబంధించిన స్పష్టమైన గణాంకాలు తర్వాత వెల్లడిస్తామని వివరించారు.
ఓటింగ్ మొదలవగానే.. సూరత్, కఛ్-సౌరాష్ట్ర జిల్లాల్లో ఈవీఎంలు పనిచేయలేదంటూ ఫిర్యాదులు వచ్చాయి.
సురేంద్రనగర్‌లో 5 ఈవీఎంలు పనిచేయలేదని అధికారులు గుర్తించారు. దీంతో పోలింగ్ ప్రక్రియ మందగించింది.
అదేసమయంలో సూరత్ జిల్లాలో కూడా 70 మిషన్లలో లోపాలున్నట్టు స్థానిక రిపోర్టర్ మనీష్ పావియా తెలిపారు.
రాజ్‌కోట్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియను ఓ వ్యక్తి మొబైల్లో వీడియో తీస్తున్న ఘటన వెలుగు చూసింది.
ఈ విషయంపై దర్యాప్తు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.
ఈవీఎం మిషన్లపై ఫిర్యాదులు రాగానే వాటి స్థానంలో కొత్త మిషన్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతోంది.
మొదటి విడతలో భాగంగా 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ, భారత క్రికెటర్ పుజారా మొదలైన వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మా ఇతర కథనాలు
- ఈ ఏడు ప్రశ్నలకు గుజరాత్ సీఎం ఏం చెప్పారు?
- అమేథీపై అమిత్ షా కన్ను, గుజరాత్‌లో రాహుల్ సవాల్
- గుజరాత్ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ ముందున్న ఐదు సవాళ్లు
- గుజరాత్ ఎన్నికలు: తెలుగు ప్రజలేమంటున్నారంటే..
- BBC EXCLUSIVE: కుల వ్యవస్థ ప్రసంగాలతో పోయేది కాదు - అంబేడ్కర్
- వందేళ్ల ఫిన్లాండ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)