#BBCGujaratOnWheels: సదుపాయాలు లేక విద్యకు దూరమవుతున్న బాలికలు
గుజరాత్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో #BBCGujaratOnWheels 'గుజరాత్ ఆన్ వీల్స్' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బీబీసీ మహిళా ప్రతినిధులు బుల్లెట్ వాహనాలపై గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
బనాస్‌కాంఠా జిల్లాలో రెండో రోజు ప్రయాణంలో భాగంగా ఈ బృందం ఉప్లాగూడా గ్రామాన్ని సందర్శించింది. బృందంలో ఒకరైన మోనికా అస్వానీ ఉప్లాగూడాలో బాలికల విద్యాభ్యాసంపై ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు.
ఇక్కడ బాలికలకు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో వారు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక 6, 7,8 తరగతులు చదవాలంటే సమీపంలోని మరో ఊరికి వెళ్లాలి.
ఉప్లాగూడాలో ఆయా తరగతుల్లో నిర్దేశిత సంఖ్యలో విద్యార్థులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. 9, 10 తరగతులు మాత్రం గ్రామంలో ఉన్నాయి.
సంబంధిత కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)