You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్‌లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
పంజాబ్ - హరియాణా సరిహద్దుల్లో ఖనౌరీ వద్ద పోలీసుల రబ్బర్ బుల్లెట్లు తగిలి ఓ రైతు మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి.
రైతుల ఆందోళలో పాల్గొన్న శుబ్ కరమ్ సింగ్ రేఖికి తలలో రబ్బర్ బుల్లెట్ తగిలిందని, ఆసుపత్రికి తీసుకు వచ్చేసరికే ఆయన చనిపోయారని పాటియాలాలోని రాజింద్ర హాస్పిటల్‌లో మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ హర్నామ్ సింగ్ రేఖి తెలిపారు.
బుల్లెట్ గాయం వల్లే మరణం సంభవించిందని ఆయన స్పష్టం చేశారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
మరణించిన శుభ్ కరం సింగ్‌ది భటిండా జిల్లాలోని బలాన్ గ్రామం.
చలో దిల్లీ కార్యక్రమంలో భాగంగా దిల్లీ బయల్దేరిన రైతులను హరియాణా- పంజాబ్ సరిహద్దుల్లో ఖనౌరీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిపై టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.
ఈ ఘర్షణలో కొంత మంది యువకులకు గాయాలయ్యాయి.
రైతు సంఘాల నాయకులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారని సంయుక్త్ కిసాన్ మోర్చా నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు.
శంభు సరిహద్దు వద్ద రైతులపై ప్లాస్టిక్ బుల్లెట్లు కాల్చడం, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రైతుల డిమాండ్లు న్యాయబద్దమేనని వాటిని నెరవేర్చాలని పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌జిందర్ సింగ్ రంధావా అన్నారు.
అయితే ఇప్పటివరకూ తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం కిసాన్ ఆందోళనలో రెతులు ఎవరూ మరణించలేదని హరియాణా పోలీసులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఖనౌరీ వద్ద ఇద్దరు పోలీసు అధికారులు, ఓ ఆందోళనకారుడు గాయపడినట్లు తమకు సమాచారం ఉందని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎస్. జైశంకర్: రష్యా విషయంలో భారత్ 'స్మార్ట్' అని అమెరికా విదేశాంగ మంత్రితో ఎందుకన్నారు?
- అమరావతి ఇప్పుడెలా ఉంది, రాజధానికి శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లలో చేసిందేమిటి?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- దిల్లీ చలో: కేంద్రంతో రైతుల చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)