స్పెయిన్‌: ఆకస్మిక వరదలతో అతలాకుతలం

స్పెయిన్‌: ఆకస్మిక వరదలతో అతలాకుతలం

స్పెయిన్‌లో సంభవించిన భయంకరమైన వరదల్లో కనీసం 158 మంది మరణించారు. గల్లంతైన వారిని కాపాడే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి.

మంగళవారం రాత్రి వచ్చిన వరదల కారణంగా చాలా ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో, బురద, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెతికితీసే పనిలో స్థానికులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.

వరదల కారణంగా కార్లు రోడ్లపైకి కొట్టుకువచ్చి ఒకదానిమీద ఒకటి నిలబడ్డాయి. మృతదేహాలను అంత్యక్రియల వాహనాల్లో తీసుకెళ్తుండటం కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)