You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆస్కార్ 2023: ‘‘నాటునాటు పాటను తరాల పాటు గుర్తుంచుకుంటారు...’’ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనల వెల్లువ
ఆస్కార్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు సినిమా బృందాలకు అభినందనలు తెలిపారు.
‘‘ఎక్సెప్షనల్!
నాటునాటు పాట అంతర్జాతీయంగా పాపులర్ అయింది. దాన్ని కొన్ని తరాల పాటు గుర్తుంచుకుంటారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ఇతర సినిమా బృందానికి శుభాకాంక్షలు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కీరవాణి, చంద్రబోసు, రాజమౌళిలతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తెలుగు పాటను చూసి గర్వపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
భారతదేశానికి ఇవి ‘‘చారిత్రక క్షణాలు’’ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఆస్కార్ గెలవడం ద్వారా ‘నాటునాటు’ పాట ‘చరిత్ర’ సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబా నాయుడు అన్నారు.
చిరంజీవి కూడా ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘భారతదేశం గర్వపడుతున్న క్షణాలివి’’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
ఈ గెలుపు ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి మాత్రమే కాదు భారతదేశం అంతటిది కూడా. ఇది ఆరంభం మాత్రమే’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
‘‘ఇదంతా కలగా ఉంది.
మా జీవితాల్లోనూ భారతదేశ చరిత్రలోనూ ఆర్ఆర్ఆర్ ప్రత్యేక సినిమాగా నిలిచి పోతుంది’’ అని రామ్ చరణ్ అన్నారు.
‘‘మా తాతలు పాటలు పాడుతూ ఉండేవారు. మా అబ్బాయి(రాహుల్ సిప్లిగంజ్)కు కూడా అదే వారసత్వం వచ్చింది. చిన్నప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడు. వాడిలోని ప్రతిభను నేను అప్పుడే గుర్తించా’’ అని వార్తా సంస్థ ఏన్‌ఐతో రాహుల్ సిప్లిగంజ్ తండ్రి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అభినందించారు.
‘‘ఆస్కార్ గెలుచుకున్న తొలి ఆసియా, భారతీయ పాటగా నిలిచి నాటునాటు చరిత్ర సృష్టించింది’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చూడండి:
- అమెరికా ఆశలు చూపించి బాలి తీసుకెళ్లి బంధించారు.. భారతీయులను కిడ్నాప్ చేస్తున్న ఇండొనేసియా ముఠా
- ఆస్కార్ 2023 : ఈ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?
- ‘ప్రార్థనల కోసం డబ్బులు చెల్లించి అప్పుల పాలయ్యాను, అద్భుతం జరిగేదెప్పుడు?’
- BBC She: మహిళలు ఎలాంటి వార్తలను ఇష్టపడతారు?
- దిల్లీ మద్యం కేసు: కవితను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. 16న మళ్లీ విచారణకు పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)