ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా వీధుల్లోకి భారీగా జనం

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా వీధుల్లోకి భారీగా జనం

ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో మార్పుల కోసం ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు చేస్తున్న ప్రయత్నాలపై అయోమయం నెలకొంది.

న్యాయ సంస్కరణలను నిలిపివేయాలని కోరుతూ దేశంలో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో దేశప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించాల్సి ఉంది.

ఈ విషయంలో ప్రభుత్వంలోని అతివాదుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన వెనకడుగు వేసే పరిస్థితి కూడా కనిపించడంలేదు. నెతన్యాహూ ప్రయత్నాలను విమర్శించిన రక్షణ మంత్రిని బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇజ్రాయెల్ నుంచి బీబీసీ ప్రతినిధి అజదే మోషిరి అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)