మా వాట్సాప్‌ చానల్‌లో ఇలా చేరండి

బీబీసీ తెలుగు వాట్సాప్ చానల్

బీబీసీ న్యూస్ తెలుగు మీ వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.

బీబీసీ తెలుగు న్యూస్ అందించే ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు నేరుగా మీ వాట్సాప్‌లోనే పొందండి.

ఉత్తమమైన స్థానిక, ప్రపంచ కథనాలను మేం మీకు అందిస్తాం.

2023 సెప్టెంబర్‌లో బ్రిటన్‌లో బీబీసీ న్యూస్ వాట్సాప్ చానల్ ప్రారంభమైంది. ఈ చానల్ ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్లు దాటింది.

ఇప్పుడు భారతదేశంలోని పాఠకులు కూడా బీబీసీ కంటెంట్‌ను తమ ఫోన్లలో తమ భాషలో పొందొచ్చు.

మీరు మీ మొబైల్ ఫోన్ లేదా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తుంటే మా చానల్‌ను ఫాలో కావడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వీడియో క్యాప్షన్, బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌ను ఇలా ఫాలో అవ్వండి

వాట్సాప్‌లో బీబీసీ న్యూస్ తెలుగును ఇలా సెర్చ్ చేయండి

మీరు వాట్సాప్‌లో ‘‘అప్‌డేట్స్’’ టాబ్ ఓపెన్ చేసి మా చానల్‌ బీబీసీ న్యూస్ తెలుగు పేరును సెర్చ్ చేయవచ్చు.

ఐఫోన్‌లో స్క్రీన్ కింది భాగంలో ఎడమవైపున, ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్క్రీన్ కింది భాగంలో చాట్స్, కమ్యూనిటీస్ టాబ్‌ మధ్యలో ‘‘అప్‌డేట్స్’’ టాబ్ ఉంటుంది.

అప్‌డేట్ టాబ్ మీద ట్యాప్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారి స్టేటస్‌తో పాటు దాని కింద చానల్స్ కనిపిస్తాయి.

అక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి బీబీసీ న్యూస్ తెలుగు (BBC News Telugu)ను సెర్చ్ చేసి, చానల్‌ను ఫాలో కావొచ్చు.

మేం ఇచ్చే అప్‌డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు చానల్ పై భాగాన ఉన్న బెల్ ఐకాన్‌ను నొక్కి అన్‌మ్యూట్ చేయండి.

మీరు వద్దనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మా చానల్‌‌ను అన్‌ఫాలో చేయవచ్చు.

మీరు మా కథనాలకు ఎమోజీల ద్వారా ప్రతిస్పందించవచ్చు. ఆ కథనాలను సులువుగా మీ వ్యక్తిగత కాంటాక్ట్స్‌లోనివారికి, వాట్సాప్‌లోని గ్రూపులకు షేర్ చేయవచ్చు.

మీ కాంటాక్ట్ వివరాలను, ఫోటో,పేరు, ఫోన్ నెంబర్‌ను చానల్‌లోని ఎవరూ చూడలేరని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యజమాని మెటా తెలిపింది.