You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
3డీ ప్రింటింగ్ ద్వారా మనిషి అవయవాల తయారీ.. ఎలా జరుగుతోంది? ఎంతవరకూ వచ్చింది?
ప్రపంచవ్యాప్తంగా అవయవదానం కోసం ఎదురుచూస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అది విపరీతమైన వేదనను మిగిల్చే నిరీక్షణ.
వారిలో కొంత మందికి మాత్రమే ఊరట లభిస్తుంది. కానీ ఇప్పుడు 3డి ప్రింటింగ్ ద్వారా సజీవ కణజాలాన్ని ఉపయోగించి అవయవాలను వృద్ధి చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీరి ప్రయోగాలు ఫలిస్తే, ఎంతో మంది ప్రాణాలు నిలుపుకోగలుగుతారు.
3డీ ప్రింటింగ్ ద్వారా అవయవాల తయారీ ఎలా?
చరిత్రలో మొట్టమొదటి విజయవంతమైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగి 70 ఏళ్లు గడిచాయి.
ఇప్పుడు ఏటా లక్షకు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి.
అయితే దీని కోసం వేచి చూడాల్సిన సమయం చాలా ఎక్కువ.
గోతెన్‌బర్గ్‌లో ఒక బృందం దీని పరిష్కారం కోసం కృషి చేస్తోంది.
3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది.
ప్రయోగశాలలో జీవకణాలను వృద్ధి చేసి, కొత్త అవయవాలను తయారు చేయడం వీరి లక్ష్యం.
ఇది విజయవంతమైతే, అవయవ దాతల అవసరం ఉండదు.
మరికొన్ని సంవత్సరాల్లో బయో ప్రింట్ ద్వారా కార్టిలేజ్ కణజాలాన్ని వృద్ధి చేసి రోగుల కండరాల సమస్యలను తొలగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు గోతెన్‌బర్గ్ ఆసుపత్రిలోని శాస్త్రవేత్తలు.
‘‘ఈ ప్రయోగం విజయవంతమైతే సమయంతో పాటు, డబ్బుకూడా ఆదా అవుతుంది.
నష్టం జరగకముందే దాన్ని అంచనావేసి ప్రింట్ చేయొచ్చు. భవిష్యత్తులో నేరుగా మోకాలి లోపలే ప్రింట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అంతే కాకుండా పెద్ద మొత్తంలో అవయవాలను తయారు చేయొచ్చు. ఎలా అంటే, ముందుగా ఒక అవయవాన్ని ప్రింట్ చేసిన తర్వాత దానికి ఎన్నో కాపీలను సృష్టించవచ్చు’’ అని సహల్‌గ్రెన్‌స్కా యూనివర్శిటీ హాస్పిటల్ క్లినికల్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ స్టినా సైమన్సన్ బీబీసీతో చెప్పారు.
ఇతరులు చేసిన అవయవ దానంతో ఈరోజు ప్రాణాలతో ఉన్నవారు ఈ సాంకేతికత తేగల మార్పు విలువేంటో బాగా అర్థం చేసుకోగలరు.
ఇందులో వెళ్లాల్సిన దూరం ఇంకా చాలా ఉన్నప్పటికీ... చర్మ కణాల నుంచి కండరాల తయారీ వరకూ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)