You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ మీద ఇరాన్ మిసైల్ దాడి ఎందుకు చేసింది?
పొరుగునే ఉన్న ఇరాన్ మంగళవారం తమ దేశంపై జరిపిన క్షిపణి దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడ్డారని పాకిస్తాన్ చెప్పింది.
పాకిస్తాన్‌లోని ‘జైష్ అల్ అదిల్’ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన రెండు స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేశామని ఇరాన్ చెప్పినట్లు ఇరాన్ సైన్యానికి అనుబంధంగా పనిచేసే ఓ వార్తాసంస్థ తెలిపింది.
ఇరాన్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్, ‘‘ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య. ఇలాంటిది తీవ్ర పర్యవసానాలకు దారి తీయొచ్చు’’ అని పేర్కొంది.
పాకిస్తాన్ కంటే ముందు ఇరాన్ గత కొద్ది రోజులలో సిరియా, ఇరాక్‌లపైనా దాడులు చేసింది.
పాకిస్తాన్‌పై ఇరాన్ ఇలా క్షిపణి దాడి చేయడం ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు.
ఇరాన్ దాడులను పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది.
‘‘మా వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే తమ గగనతలంలో ఇరాన్ ఉల్లంఘనలకు పాల్పడింది’’ అంటూ పాకిస్తాన్ పేర్కొంది.
ఇరాన్‌ది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చర్య అని పాకిస్తాన్, ఇరాన్ మధ్య కమ్యూనికేషన్‌కు అనేక మార్గాలున్నప్పటికీ అక్రమంగా ఇలాంటి చర్యలకు దిగడం ఆందోళన కలిగిస్తోందని పాక్ తన ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- 'ఇండియా ఔట్' నినాదం ఇచ్చిన మహమ్మద్ మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచారు... భారత్‌పై దీని ప్రభావం ఎంత?
- ‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ
- మాల్దీవుల ఎన్నికలు - ఇండియా, చైనా: ఇంత చిన్న దేశంలో పట్టు కోసం అంత పోటీ ఎందుకు?
- Sri lanka crisis: పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు కూడా దివాలా అంచున ఉన్నాయా?
- Lalit Modi-Sushmita Sen: 'ఓపిక.. పట్టుదల.. నిలకడతో విజయం సాధించొచ్చు’ - సుష్మితా సేన్‌తో డేటింగ్ అంటూ లలిత్ మోదీ ట్వీట్‌పై సోషల్ మీడియాలో రియాక్షన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)