లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపు, భారత్ 170 పరుగులకు అవుట్..12 చిత్రాలలో

ఇంగ్లండ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న అండర్సన్, టెండూలర్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.

193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది.

భారత్ తరఫున రవీంద్ర జడేజా అత్యధికంగా 61 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్, బెన్ స్టోక్స్ తలో మూడు వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది.

జో రూట్ 104 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కూడా సరిగ్గా 387 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 100 పరుగులు, రిషబ్ పంత్ 74 పరుగులు చేశారు.

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 192 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు.

ఆ తర్వాత 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు టార్గెట్ ఛేదించలేకపోయింది.

రెండో ఇన్నింగ్స్‌లో అర్చర్ మూడు వికెట్లు, స్టోక్స్ మూడు వికెట్లు తీశారు.

భారత జట్టులో జడేజా (61 పరుగులు) చివరి వరకు పోరాడాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)