You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనంపై భారత్ ఏమని స్పందించింది? అసలేం జరిగింది?
మోదీ ప్రభుత్వం భారత్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తిని మాల్దీవుల అధ్యక్షుడిగా చేసేందుకు ప్రయత్నించిందంటూ అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ 2024 డిసెంబర్ 30న ఒక కథనాన్ని ప్రచురించింది.
దీంతో పాటు భారత నిఘా సంస్థ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జును తొలగించేలా ఆ దేశ ప్రతిపక్షనేతలో సంప్రదింపులు జరిపినట్టు పేర్కొంది.
భారత ప్రభుత్వం 2023 మాల్దీవుల ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది.
వాషింగ్టన్ పోస్ట్ కథనం గురించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధిర్ జైస్వాల్‌ను ప్రశ్నించినప్పుడు "వాషింగ్టన్ పోస్టులో ప్రచురించిన కథనాల్లో మాల్దీవులు, పాకిస్తాన్ గురించి ప్రస్తావించారు. ఆ కథనం రాసిన రిపోర్టర్, ఆ పత్రిక తీరు ప్రశ్నార్థకంగా ఉంది. భారత్ పట్ల వారి వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. వారి కార్యకలాపాలు ఎలా ఉన్నాయో మీరూ చూడవచ్చు. వారి విశ్వసనీయత ఏంటో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం. ఇలాంటి కథనాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)