అజర్బైజాన్: ప్రధాన రహదారి దిగ్బంధంతో ఆర్మేనియా ప్రజల కష్టాలు

అజర్బైజాన్: ప్రధాన రహదారి దిగ్బంధంతో ఆర్మేనియా ప్రజల కష్టాలు

అజర్బైజాన్‌లో వివాదాస్పద నాగోర్నో- కరాబాఖ్ ప్రాంతంలో నివసిస్తున్న అర్మేనియా ప్రజలు – బయటి ప్రపంచంతో తమకు సంబంధాలు తెగిపోయాయంటున్నారు.

నిత్యావసరాలు అయిపోతున్నాయంటున్నారు. లఛిన్ కారిడార్‌లో సరఫరాల రవాణా సాగేందుకు ఉన్న ఏకైక రహదారిని అజర్బైజాన్‌కు చెందిన నిరసనకారులు నెల రోజులుగా దిగ్బంధించడమే దీనికి కారణం.

కానీ ఈ ఆరోపణలను అజర్బైజాన్ తిరస్కరిస్తోంది. మానవీయ సంక్షోభానికి తాము కారణమనే ఆరోపణ తప్పంటోంది. తమ దేశంలోకి సైనిక సామగ్రి రవాణా కోసం అర్మేనియానే ఈ రోడ్డుని వాడుకుంటోందని చెబుతుంది.

నాగోర్నో-కరాబాఖ్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య 2020లో యుద్ధం జరిగింది. అప్పటి నుంచీ అక్కడ రష్యన్ శాంతి పరిరక్షణ బలగాలను మోహరించారు.

బీబీసీ ప్రతినిధి రేహాన్ దిమిత్రీ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)