You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హమాస్ దాడులకు ఏడాది: గాజాలో 42వేల మంది మృతి
ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడుల్లో ఇప్పటిదాకా దాదాపు 42 వేల మంది పాలస్తీనీయులు మరణించగా వారిలో ఎక్కువ మంది సామాన్య పౌరులే.
ఆచూకీ లేని పది వేల మంది భవనాల శకలాల కింద సజీవ సమాధి అయి ఉంటారని అంచనా.
మృతుల్లో, క్షతగాత్రుల్లో 40 శాతం వరకు చిన్నారులేనని అంచనా.
తాము యుద్ధ చట్టాలను పాటిస్తామని, పౌరులకు ప్రాణనష్టం జరక్కుండా చూస్తామని ఇజ్రాయెల్ చెప్తోంది.
అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా తమపై చేసిన జాతిహననం ఆరోపణల్ని ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది.
20 లక్షల మందికి పైగా గాజా ప్రజలు ఆహారం, నీరు, వైద్యసహాయం అందక వినాశకర పరిస్థితిలో చిక్కుకుపోయారని యూఎన్ అంటోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)