ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్, ఇంకా ఎవరికి ఏ శాఖ ఇచ్చారంటే...

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు.

చంద్రబాబుతో పాటు మరో 24 మంది బుధవారంనాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

చంద్రబాబు మంత్రి వర్గంలో జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి స్థానం దక్కింది.

తాజాగా మంత్రులందరికీ శాఖలను ప్రకటించారు.

మంత్రి వర్గం పూర్తి స్వరూపం

నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి): సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, మంత్రులకు కేటాయించని ఇతర పోర్ట్ ఫోలియోలు

కొణిదెల పవన్ కల్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) - పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ

నారా లోకేశ్ - మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ

కింజరాపు అచ్చెన్నాయుడు - వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ

కొల్లు రవీంద్ర - గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్

నాదెండ్ల మనోహర్ - పౌరసరఫరాల శాఖ

పొంగూరు నారాయణ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ

అనిత వంగలపూడి - హోంశాఖ, విపత్తుల నిర్వహణ

సత్యకుమార్ యాదవ్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య

డాక్టర్ నిమ్మల రామానాయుడు - జలవనరుల అభివృద్ధి శాఖ

ఎన్‌ఎండీ ఫరూఖ్ - లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమం

ఆనం రామనారాయణ రెడ్డి - దేవాదాయ శాఖ

పయ్యావుల కేశవ్ - ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాలు

అనగాని సత్యప్రసాద్ - రెవిన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లు

కొలుసు పార్థసారథి - గృహనిర్మాణం, సమాచార శాఖ

డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి - సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ

గొట్టిపాటి రవికుమార్ - విద్యుత్ శాఖ

కందుల దుర్గేష్ - పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ

గుమ్మడి సంధ్యారాణి - గిరిజన, మహిళా, శిశు సంక్షేమం

బీసీ జనార్దన రెడ్డి - రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు

టీజీ భరత్ - పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్

ఎస్. సవిత - బీసీ సంక్షేమం, చేనేత, జౌళి

వాసంశెట్టి సుభాష్ - కార్మిక శాఖ, లేబర్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్

కొండపల్లి శ్రీనివాస్ - చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై వ్యవహారాలు

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి - రవాణా, యువజన, క్రీడలు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)