పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో ఎలా చిక్కుకుంది?

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో ఎలా చిక్కుకుంది?

ఆర్థిక సంక్షోభానికి తాజా అడ్రస్‌గా మారింది పాకిస్తాన్‌.

ఆర్థిక సంక్షోభం అంటే.. ఒక దేశం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, దేశ ప్రజలకు అవసరమైన నిత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితులకు చేరుకోవడం.

దాంతో మనం తినే, వినియోగించే అత్యవసరాల ధరలన్నీ కొండెక్కి కూర్చుంటాయి. పాకిస్తాన్‌లో ఇప్పుడు అక్షరాలా ఇదే జరుగుతోంది.

నిజానికి పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం గురించి మనం చాలా కాలం నుంచే వింటున్నాం.

మేం ఈ పరిస్థితి నుంచి కచ్చితంగా బయటపడతాం అని ఆ దేశ ప్రభుత్వం చెబుతున్నా.. అలాంటి పరిస్థితైతే ఎక్కడా కనిపించట్లేదు సరికదా నిజానికి అంతకంతకూ అది తీవ్రమవుతోంది కూడా.

రోజులు గడిచేకొద్ది పాకిస్తాన్ అప్పుల ఊబిలో మరింతగా కూరుకుపోతోంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ మరో శ్రీలంక కానుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి?

పాక్ ఓడ.. నిండా మునిగేవరకు ఆ దేశ పాలకులు, ప్రభుత్వం ఎందుకు మేలుకోలేదు?

అప్పుల కోసం IMF వైపు చూస్తున్నా ఆ సంస్థ ఎందుకని స్పందించడం లేదు?

అక్కడ పరిస్థితులు ఇంతగా దిగజారిపోవడానికి కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)