ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అనంతర దృశ్యాలు, 9 ఫోటోలలో...

హెచ్చరిక: కలిచివేసే దృశ్యాలు

అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశంలో వెంటనే సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఎయిర్ ఇండియా విమానం డాక్టర్ల హాస్టల్ భవనంపై కూలింది.

ప్రమాద ప్రాంతంలో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి కనిపించాయి.

ప్రమాద ఘటన తెలిసిన వెంటనే ఫైరింజన్లు రంగంలోకి దిగాయి.

బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు మోహరించారు.

విమానం పడటంతో అక్కడే ఉన్న ఓ చెట్టు ఇలా విరిగిపోయింది.

బాధితుల కోసం చేరుకున్న ఓ అంబులెన్స్

విమాన ప్రమాదం తర్వాత అక్కడ పెద్ద ఎత్తున పొగ, మంటలు కనిపించాయి.

విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో విమాన సహాయ సిబ్బంది 10మంది కాగా, పైలట్లు ఇద్దరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)