You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాగస: ఈ తుపానును ‘King of storms’ అని ఎందుకంటున్నారు? 9 ఫోటోలలో దాని తీవ్రతను చూడండి....
వేగంగా దూసుకొస్తున్న రాగస తుపాను దక్షిణ తీరాన్ని తాకడంతో లక్షలాది మందిని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి తరలించింది చైనా.
10 నగరాల్లోని స్కూళ్లు, కొన్ని బిజినెస్‌లను తుపాను తగ్గేవరకు మూసివేయాలని ఆదేశించింది.
హాంకాంగ్‌వైపు సూపర్ టైఫూన్ రాగస రానున్న నేపథ్యంలో టైఫూన్ వార్నింగ్‌ను 8కి ఎనిమిదికి అప్‌గ్రేడ్ చేసింది. గరిష్ట స్థాయి కంటే ఇది కేవలం రెండు స్థాయిలు తక్కువ.
ఫిలిప్పీన్స్‌లో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు ఖాళీ చేయించారు.
తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానిక అధికారులు చెప్పారు.
ఈ తుపానుకు 'రాగస' అనే పేరు పెట్టారు.
సోమవారం తీరాన్ని తాకిన తరువాత ఇది కొంత బలహీనపడింది.
రాగస కారణంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో స్కూళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు మూసివేశారు.
వరదలు రావొచ్చని, కొండచరియలు విరిగిపడొచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇళ్లు, భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు.
రాగస తుపాను ఫిలిప్పీన్స్‌లోని బాబుయాన్ దీవులపై ఎక్కువ ప్రభావం చూపింది. అక్కడ దాదాపు 20,000 మంది నివసిస్తున్నారు.
తుపాను కారణంగా మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తుకు అలలు ఎగసిపడతాయని ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
రాగస ప్రభావం ఉంటుందన్న అంచనాలతో దక్షిణ చైనా, తైవాన్‌లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ తుపాను బుధవారం చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తీరాన్ని తాకే అవకాశం ఉంది.
అక్కడ నుంచి ఇప్పటికే 370,000 మందిని ఖాళీ చేయించారు.
రాగస ను చైనా వాతావరణ సంస్థ ‘కింగ్ ఆఫ్ స్ట్రామ్స్’ అని వర్ణించింది.
రాబోయే రోజుల్లో ఈ తుపాను ఉత్తర వియత్నాంవైపు కదులుతుందని, లక్షలాది మందిని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)