You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హ్యాపీ న్యూ ఇయర్ 2018
నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. భారత్‌కన్నా ఏడుగంటల ముందే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ 2018లోకి అడుగుపెట్టింది. తర్వాత ఆస్ట్రేలియాలోనూ సంబరాలు మిన్నంటాయి.
భారత్‌లోని నగరాల్లోనూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముంబయిలోని ప్రధాన కూడళ్లు జనసందోహంగా మారాయి.
దిల్లీలోని ఇండియా గేట్ ప్రాంతం కోలాహలంగా మారింది.
గతేడాది మహిళలపై జరిగిన వేధింపుల ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి బెంగళూరులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
"ఎవరికీ బలవంతంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రయత్నించొద్దు" అని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అన్నారు.
నూతన సంవత్సరానికి స్వాతం పలికేందుకు దిల్లీలోని ఇండియా గేట్ వద్దకు వేలాది మంది తరలివచ్చారు.
ముంబయిలోని చత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్‌ను ఇలా విద్యుత్ దీపాలతో అలంకరించారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న ప్రపంచంలోనే ఐదో ఎత్తైన(555 మీటర్లు) భవనం బాణాసంచా వెలుగులతో ఇలా మెరిసిపోయింది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇండోనేసియాలో సంబరాలు అంబరాన్నంటాయి. బాలిలో నిర్వహించిన సంప్రదాయ పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. జకార్తాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సామూహిక వివాహాలు జరిపించారు.
ఆస్ర్టేలియాలోని సిడ్నీలోనూ కొత్త సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. అక్కడి హార్బర్ బ్రిడ్జ్‌పై బాణా సంచా వెలుగులను పై చిత్రంలో చూడొచ్చు.
ఆక్లాండ్‌లో ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున బాణా సంచా కాల్చి వేడుకలు చేసుకున్నారు.
మరోవైపు భారత్ సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ ప్రజలు ఈ రాత్రి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు సన్నద్ధమయ్యారు.
భారత్‌లోని అమృత్‌సర్‌లో బాలికలు ఇలా ముఖానికి 2018 రంగులద్దుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
తెలుగు రాష్ర్టాల్లోనూ కొత్త సంవత్సర వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడా 2018కి ఘనంగా స్వాగతం పలికేందుకు యువత సిద్ధమైంది.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)