ఉత్తర కొరియా: పొరుగుదేశంలోకి పారిపోవాలని సరిహద్దు దాటిన సైనికుడు

ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే.

అలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియా సైనికుడు ఒకరు ఏకంగా దక్షిణకొరియాలోకి ఫిరాయించాలని సరిహద్దు దాటాడు. అతన్ని వెంబడించిన సహచర ఉత్తర కొరియా సైనికులు కాల్పులు జరిపారు.

ఇరు దేశాల మధ్య ఉన్న సంయుక్త భద్రతా ప్రాంతం (జేఎస్ఏ) వద్ద సరిహద్దు దాటాలని అతను ప్రయత్నించాడు. ఒక జీపులో వేగంగా సరిహద్దు దాటాలని చూడగా.. ఉన్నట్టుండి జీపు చక్రం ఒకటి విరిగిపోయింది. దీంతో ఎలాగైనా ఉత్తర కొరియా నుంచి బయటపడాలని దక్షిణ కొరియా వైపు పరిగెత్తాడు.

ఈ హఠాత్ పరిణామానికి ఖంగుతిన్న ఉత్తర కొరియా సైనికులు వెంటనే స్పందించి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.

గాయపడ్డ ఆ సైనికుడు ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ప్రతి ఏటా కనీసం వెయ్యి మంది ఉత్తర కొరియా సైనికులు సరిహద్దు దాటి దక్షిణ కొరియాలోకి ప్రవేశిస్తున్నారు.

1953లో జరిగిన కొరియా యుద్ధం తర్వాత.. ఇప్పటి వరకూ 30 వేల మందికి పైగా ఉత్తర కొరియన్లు సరిహద్దు దాటి తమ దేశంలోకి వచ్చారని దక్షిణ కొరియా చెబుతోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)