స్ట్రాబెరీ ఉంగరం చెప్పే కథ

    ఎవరీ అమ్మాయి? తన ప్లాస్టిక్ ఉంగరాన్ని తొలగించడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు?

    News imageNews imageNews image
    ఈ అమ్మాయి పేరు అలా.
    ఈమె వయసు ఆరేళ్లు.

    తన అక్కతో, తమ్ముడితో ఆడుకోవడమంటే
    అలాకు చాలా ఇష్టం.
    News image
    తన చేతికున్న ఉంగరమంటే అలాకు ప్రాణం.
    – అలాకు నానమ్మ ఇచ్చిన బహుమతి అది.
    News image
    అలా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంది.
    ఓ ట్యూబ్ ద్వారా ఆమెకు ఆహారాన్ని అందిస్తున్నారు.
    అలాది పేద కుటుంబం.
    ఆమెకు పోషకాహారాన్ని పెట్టే పరిస్థితి ఆ కుటుంబానికి లేదు.
    News image
    అలా ఒక్కటే కాదు...
    News image

    అలా స్వదేశం యెమెన్‌లో అనేక కుటుంబాలు ఇలా
    ఆకలి బాధలు అనుభవిస్తున్నాయి.

    News image
    యుద్ధం, ఆహార కొరత, వ్యాధుల లాంటి సమస్యలు
    అక్కడ అతిపెద్ద మానవ సంక్షోభాన్ని సృష్టించాయి.
    News image
    ఆ దేశ ప్రజలు ప్రస్తుతం కరవు అంచుల్లో జీవిస్తున్నారు.
    News image
    ఆ సంక్షోభ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది.
    News image
    2015 నుంచి కొనసాగుతున్న యుద్ధంలో వేల మంది చనిపోయారు.
    అనేకమంది గాయాలపాలయ్యారు.
    News image
    పిల్లలు జీవించడానికి ఏమాత్రం అనువుకాని ప్రదేశాల్లో
    యెమెన్ ఒకటని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
    News image
    “నా పిల్లలను బతికించుకోవడానికి నాకు పని దొరికితే చాలు”
    అని అలా తల్లి రహ్మా అంటారు.
    కుటుంబాన్ని పోషించడానికి ఆమె నగలన్నీ అమ్మేశారు.
    News image

    ఐదేళ్లలోపు వయసున్న దాదాపు 18 లక్షల మంది చిన్నారులు అక్కడ
    తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. తగిన సాయం అందకపోతే
    వారిలో దాదాపు 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

    News image
    యెమెన్‌లోని దాదాపు 80 లక్షల మంది పోషకాహారం అందక
    ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
    News image
    1.1కోట్ల మంది యెమెన్‌ ప్రజలకు తక్షణ సాయం కావాలి.
    News image
    1.6కోట్లమందికి ప్రాథమిక వైద్య సాయం అవసరం.
    వాళ్లకు సురక్షిత తాగు నీరు కూడా అందుబాటులో లేదు.
    News image
    దాదాపు 1.8కోట్లమంది.. అంటే యెమెన్‌లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి
    తాము తినబోయే ఆహారం ఎక్కడి నుంచి అందుతుందో తెలీదు.
    News image
    2.2కోట్ల మంది.. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు ఆహార,
    వైద్య సాయం కోసం చూస్తున్నారు.
    వాళ్లలో సగం మంది పిల్లలే.
    News image

    మొదట అలాకు పోషకాహారలేమికి సంబంధించిన చికిత్స అందింది.
    కానీ తరవాత టీబీ సోకడంతో ఆమె మళ్లీ ఆస్పత్రి పాలైంది.

    News image
    ఇప్పుడు అలా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికెళ్లి నెమ్మదిగా కోలుకుంటోంది.
    ఎన్ని సమస్యలు ఎదురైనా, అలా తన స్ట్రాబెరీ ఉంగరాన్ని మాత్రం తీయలేదు.
    News image