2011 డిసెంబర్ 28 – ప్యాంగ్‌యాంగ్‌లో ఎముకలు కొరికే చలి.
వీధుల్లో నల్లటి లింకన్ కాంటినెంటల్ కారు మెల్లగా కదులుతోంది. అది వెళ్తున్న దారి పొడవునా మంచు కురుస్తోంది. ఆ కారు రూఫ్ పై పరుపులా పరచిన తెల్లటి క్రిసాంతిమం పూలమీద ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్-ఇల్ శవపేటిక ఉంచారు.
వీధుల్లో నల్లటి దుస్తులు వేసుకున్న జనం భారీగా గుమిగూడారు. అదుపుచేయలేని స్థితిలో ముందుకు చొచ్చుకొస్తున్న వారిని సైన్యం వెనక్కు నెడుతోంది. గుండెలు బాదుకుంటున్న అందరూ ఫాదర్, ఫాదర్ అని రోదిస్తున్నారు.
మరణించిన నియంత కొడుకు, 27 ఏళ్ల కిమ్ జోంగ్-ఉన్ కారు పక్కనే నడుస్తున్నారు. ఆయాత్ర పొడవునా చెమర్చిన కళ్లను ఆయన ఎన్నోసార్లు తుడుచుకుంటూనే ఉన్నారు.
సరిగ్గా కిమ్ వెనుక ఉత్తర కొరియాలో రెండో అత్యంత శక్తిమంతుడుగా భావించే ఆయన చిన్నాన్న చాంగ్ సాంగ్-తైక్ నడుస్తున్నారు. మరో వైపు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రి యాంగ్-హో, రక్షణ మంత్రి కిమ్ యాంగ్-చున్ ఉన్నారు.
ప్యాంగ్‌యాంగ్‌లో ఇక అధికారం చెలాయించబోయే పెద్ద మనుషులు వీళ్లే. అందరూ అదే అనుకుంటున్నారు.
కమ్యూనిస్ట్ ప్రపంచానికి భిన్నంగా 1950లో కిమ్ జోంగ్-ఉన్ తాత కిమ్ 2-సంగ్ నార్త్ కొరియాలో వన్ మ్యాన్ వారసత్వ నాయకత్వాన్ని సృష్టించారు.
కిమ్ పెద్ద కొడుకు కిమ్ జోంగ్-ఇల్‌ను సుమారు రెండు దశాబ్దాలు తన వారసుడుగా పెంచారు. ఆయన ఎక్కడికి వెళ్లినా యువరాజు ఆయన వెంటే ఉన్నారు. 1994లో ఆయన మరణించినపుడు, కిమ్ జోంగ్-ఇల్ తక్షణం అధికారం అందుకున్నారు. కానీ 2011లో హఠాత్తుగా కన్నుమూసినపుడు, ఆయన కొడుకు ఉత్తర కొరియా మూడో సుప్రీం లీడర్ అయ్యేందుకు అప్పుడే శిక్షణ మొదలుపెట్టారు. దీంతో రాజరికం కుప్పకూలుతుందని చాలా మంది ఊహించారు.కానీ వారి అంచనా తప్పని త్వరలోనే నిరూపితమైంది.
కొన్ని నెలల్లోనే చీఫ్ ఆఫ్ స్టాఫ్ రి యాంగ్-హో, రక్షణమంత్రి కిమ్ యాంగ్-చున్ ఇద్దర్నీ తొలగించారు. రీ ఆచూకీ ఇప్పటికీ మిస్టరీగా మారింది.
తర్వాత 2013 డిసెంబర్‌లో కిమ్ జోంగ్-ఉన్ అత్యంత నాటకీయ ఎత్తు వేశారు. తన సొంత చిన్నాన్న, చాంగ్ సాంగ్-థైక్‌ను పార్టీ సమావేశం నుంచి పక్కకు లాగేశారు. రాజద్రోహం ఆరోపణలతో ఆయనకు మరణశిక్ష విధించారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ తుపాకీ ఉపయోగించాలని కూడా సూచించారని చెబుతారు. కానీ దీనిని ఎవరూ ధ్రువీకరించలేదు.
ఉత్తర కొరియాలో తమ తాతల కాలం నుంచీ జరగని అతిపెద్ద ప్రక్షాళనను 2012-2016 మధ్యలో కిమ్ చేశారు. దక్షిణ కొరియాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ నివేదికల ప్రకారం 140 మంది సీనియర్ సైనిక అధికారులకు, ప్రభుత్వఅధికారులకు ఆయన మరణశిక్ష విధించారు. మరో 200 మందిని తొలగించారు, జైల్లో పెట్టారు.
తన దారికి ఎవరైనా అడ్డుగా ఉన్నారని అనిపిస్తే వారందరినీ కిమ్ తొలగించారు. తనకు నమ్మకస్తులైన యువతరంతో ఆ స్థానాలు భర్తీ చేశారు. ఆయన సొంత సోదరికిమ్ యో- జోంగ్ వారందరికీ నాయకత్వం వహించేవారు. ఆమెను 2017లో 30 ఏళ్ల వయసులో పోలిట్‌బ్యూరోలో నియమించారు.
ప్రస్తుతం ప్యాంగ్‌యాంగ్‌లో అధికారం ఎవరి చేతుల్లో ఉందనే విషయానికి వస్తే, ఎలాంటి సందేహంలేదు. ఆ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్-ఉన్.
2018లో ఒక వెచ్చటి మధ్యాహ్నం. కిమ్ జోంగ్-ఉన్ ఒక చెక్క వంతెనపై కూర్చుని ఉన్నారు. అది ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సైనికుల మొహరింపులేని జోన్(డీఎంజడ్) మధ్యలోని ఒక అటవీ ప్రాంతంలో ఉంది.
ప్యాంగ్‌యాంగ్‌లో మంచు కురిసిన ఆ చల్లటి రోజు గడిచి ఇప్పటికి ఆరేళ్లైంది.
టీ తాగుతున్న కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ చెబుతున్నది శ్రద్ధగా వింటున్నారు. ఆ సమావేశం ప్రపంచమంతా ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. చూస్తున్న వారందరికీ వాళ్లేం మాట్లాడుకుంటున్నారో ఒక్క మాట కూడా వినిపించడం లేదు.

అరగంట తర్వాత వారి పెదాల కదలికలకు ప్రపంచంలో ఉన్న చాలా మంది మాటల రూపం ఇచ్చారు. వారి ప్రతి మాటనూ చదివే ప్రయత్నం చేశారు.
కొన్ని నెలల క్రితమే కిమ్ జపాన్ మీదుగా క్షిపణులను పరీక్షించాడు. దక్షిణ కొరియా, అమెరికాలపై క్షిపణుల వర్షం కురిపిస్తానని బెదిరించాడు.
ఇప్పుడు ఆయన చిరునవ్వులు చిందిస్తూ తన ఆగర్భ శత్రువుతో మాటల్లో మునిగిపోయి ఉన్నారు.
అక్కడ ఎన్నో ప్రశ్నలు. కిమ్ ఏం కోరుకుంటున్నాడు? ఇదిమోసమా, అందమైన ఆక్రమణా, తన తాత కిమ్ 2 సృష్టించిన దానికి, తండ్రి కిమ్ జోంగ్-ఇల్, తనకు అందించిన దానికి భిన్నంగా కిమ్ కొత్త మార్గం ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారా?

- ప్యాంగ్‌యాంగ్‌లోని ఒక విల్లాలో 8 ఏళ్ల బాలుడి కోసం చాలా ప్రత్యేకమైన జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. వారందరిలోకీ ఒకరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు.
అది జనరల్ యూనిఫాం. బొమ్మ కాదు, కానీ అసలు విషయం ఏంటంటే- ఒక మీనియేచర్. కానీ, చూడ్డానికి మాత్రం పూర్తిగా కొరియన్ పీపుల్స్ ఆర్మీ జనరల్ యూనిఫాంలాగే ఉంది.
‘‘ఒక మామూలు మనిషిలా పెరగడం అనేది అతడికి అసాధ్యంగా మారింది”
వేడుకలకు వచ్చిన మిగతా సీనియర్ జనరల్స్ కూడా ఆ ఎనిమిదేళ్ల బాలుడికి సెల్యూట్ చేశారు. ఆ బాలుడే కిమ్ జోంగ్-ఉన్.
వాషింగ్టన్ పోస్ట్ 2016లో ఆయన అత్తను ఇంటర్వ్యూ చేయడంతో,ఈ 8 ఏళ్ల బాలుడు జనరల్ కిమ్‌గా ఎలా ఎదిగాడనే కథ వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండుదశాబ్దాల క్రితం కో యాంగ్-సుక్, ఆమె భర్త ఆ దేశాన్ని వదిలి పశ్చిమానికి చేరుకున్నారు. ఇప్పుడు వాళ్లు న్యూయార్క్ బయట చాలా ప్రశాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో ఒంటరిగా జీవిస్తున్నారు.
కిమ్ జోంగ్- ఉన్, తన తండ్రి కిమ్ జోంగ్-2కు వారసుడని ఆ రోజు జరిగిన పుట్టినరోజు వేడుకలు అందరినీ ఒప్పించాయని ఆమె ఆఇంటర్వ్యూలో చెప్పారు.
“చుట్టూ ఉన్న వారు తనను అలా చూస్తున్నప్పుడు ఒక మామూలుమనిషిగా పెరగడం అతడికి అసాధ్యంగా మారింది” అని కో చెప్పారు.
కొన్నేళ్ల తర్వాత కిమ్ జోంగ్-ఉన్‌ను ఆయన తండ్రి ఒక ప్రైవేటు స్కూల్లో చేర్పించేందుకు స్విట్జర్లాండ్ పంపించినపుడు అతడికి తోడుగా కోయాంగ్-సక్‌ను అక్కడికి పంపించారు.
కిమ్ టీనేజిలో ఊరికే ఉద్రేకపడిపోయేవాడని, దూకుడుగా ఉండేవాడని ఆమె చెప్పారు.
“తను అంత ఇబ్బంది పెట్టేవాడు కాదు, కానీ తనకు ఉద్రేకం ఎక్కువ. సహనం తక్కువ. ఆటలు ఎక్కువైపోయి, చదువుపై శ్రద్ధ తగ్గిందని వాళ్లమ్మ తిడితే, తను మాట్లాడ్డం ఆపేసేవాడు. తినకుండా ఉండడం, ఇంకా చాలా రకాలుగా తన కోపాన్ని చూపించేవాడు”

కిమ్ బాల్యంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మాత్రమే అందరికీ తెలుసు. తన అన్న, సవతి సోదరుడిని మించి తండ్రి దృష్టిలో వారసుడు కావడానికి అతడి సమర్థత కూడా కారణమైంది.
కిమ్ జోంగ్-ఉన్ అధికారంలోకి వస్తారని మొట్ట మొదట ఒక జపనీస్ సుషీ షెఫ్ ఊహించారు. అతడిని కెంజీ ఫుజిమోటో అని పిలుస్తారు.
1990లలో ఫుజీమోటో అనుకోకుండా కిమ్స్ కుటుంబానికి దగ్గరయ్యారు. ఆయన కిమ్ జోంగ్-2 కోసం జపనీస్ వంటలు చేసేవారు. చిన్నప్పుడు కిమ్జోంగ్-ఉన్‌తో ఆడుకునేవాడు.
2001లో ఫుజీమోటో జపాన్ తిరిగి వచ్చినపుడు ఆయన తన గురించి ఒకపుస్తకం ప్రచురించారు. అందులో కిమ్ జోంగ్-ఉన్, అతడి అన్న కిమ్ జోంగ్-చోల్‌ను మొదట కలిసిన రోజు గురించి చెప్పుకొచ్చారు.
“నేను మొట్టమొదటి సారి యువరాజులను కలిసినప్పుడు, వాళ్లిద్దరూ మిలిటరీ యూనిఫాంలు వేసుకుని ఉన్నారు. వాళ్లు స్టాఫ్‌లో ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు. కానీ నాకు చేయిచ్చే విషయానికి వస్తే, యువరాజు కిమ్ జోంగ్-ఉన్ నా వైపుచాలా కోపంగా చూశాడు. ఆ చూపులు ‘నీలాంటి జపనీయులు మాకు నచ్చరు’ అంటున్నట్టు ఉన్నాయి. అప్పుడు తనకు ఏడేళ్లు, ఆ చూపుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను”
2003లో ఫుజీమోటో తన రెండో పుస్తకంలో ఇలా రాశారు:
“చాలా మంది కిమ్ జోంగ్-చోల్ తండ్రికి వారసుడు అవుతాడనుకున్నారు. కానీ నాకు దానిపై చాలా సందేహాలు ఉండేవి. “కిమ్ జోంగ్-చోల్ పనికిరాడని, తను ఆడపిల్ల లాంటి వాడని” కిమ్ జోంగ్-2 చెప్పేవారు. ఆయనకుచిన్న కొడుకంటేనే ఇష్టం. రెండో యువరాజు కిమ్ జోంగ్-ఉన్ అంతా వాళ్ల నాన్నలాగే ఉండేవారు. ఆయన వాళ్ల నాన్నలాగే పెరిగారు. కానీ ఆయన ఉన్నట్టు ప్రజలకు తెలియనివ్వలేదు.”
అది ఒక గొప్ప అంచనా. ఉత్తర కొరియా ప్రజలకు తెలీని సమయంలో కిమ్ బయటి ప్రపంచంలో ఒంటరిగా పెరిగారు. ఆయన బాల్యంలో చాలా భాగం ఇప్పటికీ పూర్తిగా రహస్యం.
చోయ్ మిన్-జున్ 14 ఏళ్ల వయసులోనే, ఉత్తర కొరియా సైన్యం-సుప్రీం గార్డ్ కమాండ్‌లోని చాలా కీలక యూనిట్‌కి ఎంపికయ్యారు. ఈరోజు ఆయన దేశం నుంచి బయటపడి దక్షిణ కొరియాలో మారుపేరుతో జీవిస్తున్నారు.
ఉత్తర కొరియా రాజరికాన్ని కాపాడే ఒక రహస్య యూనిట్‌ను మనం ఇటీవలే చూశాం. కిమ్ జోంగ్-ఉన్ ఏప్రిల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వచ్చినపుడు, ఆయన మెర్సిడెస్ లిమోసిస్ పక్కనే సూట్లు వేసుకుని పరిగెడుతున్న పొడవాటి సైనికుల బృందాన్ని చూశాం.వీరంతా సుప్రీం గార్డ్ కమాండ్ ఇన్నర్ ర్యాంక్ వారు. ఉన్నత శ్రేణికి చెందిన వారు.
చో మిన్-జున్‌కు ఆ ఇన్నర్ సర్కిల్‌లోకి వెళ్లే అవకాశం దక్కలేదు. ఆయన అంత పొడవుగా ఉండరు. అంతకంటే ముఖ్యంగా ఆయన కుటుంబ నేపథ్యం కూడా భిన్నం.
“నేను సమాజంలో ఉన్నత శ్రేణి వర్గంలో పుట్టలేదు. అందుకే నేను సుప్రీం లీడర్స్ పర్సనల్ బాడీగార్డ్‌గా సేవలు అందించలేక పోయాను, బదులుగా నన్ను యుద్ధం చేసే యూనిట్‌లో వేశారు” అని చోయ్ చెప్పారు.
సామ్యవాద దేశంగా ఉండడంపై అంతటా వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఉత్తరకొరియాలో విస్తృతమైన, కఠినమైన కుల వ్యవస్థ ఉంది. అది పుట్టుక నుంచీ ప్రతి ఒక్కరినీ వర్గీకరిస్తుంది. దీన్ని సాంగ్బన్ అంటారు. ఎన్‌కే న్యూస్ అనే వెబ్‌సైట్ సాంగ్బన్ అంటే ఏంటో ఇలా వివరిస్తుంది:
“కొరియాయుద్ధం, జపాన్ వలస పాలన సమయంలో వారి పనులు, పూర్వీకుల స్థితిని బట్టి జనాభాను ఇది వర్గీకరించింది. వారిని రాజధానిలో ఉండడానికి అనుమతించ వచ్చా, వారికి ఎలాంటి విద్య అందించాలి, ఎలాంటి పనిని కేటాయించాలి అనేది సాంగ్బన్ నిర్ణయిస్తుంది”
ఇందులో కీలకమైనది సాంగ్బన్ స్థితిలో మార్పు ఉండదు. ఎవరి తాతలైనా కొరియా స్వాధీనం సమయంలో జపాన్‌తో యుద్ధం చేసి ఉంటే, వారి వారసులను విశ్వాసపాత్రులుగా భావిస్తారు. జపాన్ వలస పాలకుల వైపు ఎవరైనా పనిచేసుంటే, వారిని శత్రువులుగా భావిస్తారు, వారు ఇక ఎప్పటికీ అలాగే ఉండిపోతారు.
చోయ్ కుటుంబం వ్యవసాయం చేసేది. వారు జపనీయులకు ఏ సేవలు చేయలేదు, వారిపై వ్యతిరేకత కూడా లేదు. దాంతో చోయ్‌ను యుద్ధం యూనిట్‌లోకి పంపించారు. ఆ సమయంలో ఆయన స్థితి విశ్వాసాన్ని నిరూపించుకునేలా లేదు.
“ఉత్తరకొరియాలో చిన్నప్పటి నుంచే బ్రెయిన్ వాష్ చేస్తారు. కిమ్ కుటుంబం దేవుళ్లని నాకు చెప్పారు. నేను కూడా దాన్ని నమ్మాను” అని ఆయన చెప్పారు.
‘‘కిమ్ఇల్-సంగ్ కొత్త ఏడాదిలో ప్రసంగించినపుడు, ఈ ఏడాది మనం మరింత ఎక్కువ బొగ్గు తవ్వకాలు జరపాలన్నారు. నేను గనుల దగ్గరకు వెళ్తానన్నాను. కిమ్ కుటుంబంపై నాకు అంత నమ్మకం ఉండేది.’’
సుప్రీం గార్డ్ కమాండ్ విదేశీ శత్రువుల నుంచి కిమ్ కుటుంబాన్ని రక్షించడానికి కాదు అని, సొంత ప్రజల నుంచి వారిని కాపాడుకోవడానికి మాత్రమే అని చోయ్ త్వరగానే గుర్తించాడు.
“కిమ్ కుటుంబానికి ప్రతి ఒక్కరూ శత్రువు కావచ్చు. ఉత్తర కొరియా సైన్యం, జనరల్ స్టాఫ్ డిపార్ట్‌మెంట్, పీపుల్స్ ఆర్మ్డ్ ఫోర్స్ మినిస్ట్రీతోపాటూ కొరియా ప్రజలంతా ఆయనకు శత్రువులుగా మారవచ్చు” అని అయన నాకు చెప్పారు.
తన తల్లిదండ్రులను కూడా నమ్మలేని విధంగా చోయ్‌కు శిక్షణ ఇచ్చారు.
కిమ్ కుటుంబాన్ని మృత్యుభయం వెంటాడేకొద్దీ, వారి వ్యక్తిగత భద్రతా దళాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
“ఈస్టర్న్ బ్లాక్ కుప్పకూలినపుడు, సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు, వాటిని చూసిన కిమ్ కుటుంబం షాక్ అయ్యింది. దాంతో వాళ్లు సుప్రీం గార్డ్ కమాండ్స్ సంఖ్యను విపరీతంగా పెంచేశారు, ఇప్పుడు అందులో దాదాపు లక్ష 20 వేల మంది సైనికులు ఉన్నారు” అని ఆయన చెప్పారు.
మధ్యయుగం నాటి రాచరికంలో లాగే, కిమ్ పాలనను, వారి శక్తిని చూసి ఈర్ష్యతో. తన చుట్టూ శత్రువుల సంఖ్య కూడా పెరిగింది.
తరాల నుంచీ ఎన్నో రాజవంశాలలాగే, వీరు కొన్నిసార్లు తమ స్థానాన్ని కాపాడుకోడానికి హత్యలు చేశారు.

ఫిబ్రవరి 12న మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉన్న ఒక రెస్టారెంటులో కొంతమంది స్నేహితులు కలిశారు. వారంతా సిటి ఐస్యా అనే ఇండోనేషియా మహిళ 25వ పుట్టినరోజు సంబరాల కోసం అక్కడికి వచ్చారు. స్నేహితుల్లో ఒకరు ఫోన్‌లో తీసిన వీడియోలో ఆమె నవ్వడం, కొవ్వొత్తి ఆర్పడం, పాడడం కనిపిస్తుంది.
ఐస్వా చెప్పిన వివరాల ప్రకారం ఆ రాత్రి ఆమె తన స్నేహితులకు ఒక ఆసక్తికరమైన వార్త చెప్పింది. తనకు ఒక టీవీ రియాలిటీ షోలో ఉద్యోగం వచ్చిందని అంది. అప్పటి వరకూ పనిచేస్తున్న కౌలాలంపూర్ బాత్‌హౌస్ నుంచి ఆమె తప్పించుకోబోతోంది. నువ్వు ఇక స్టార్ అయిపోతున్నావంటూ స్నేహితులు ఆమెను ఆటపట్టించారు.
తర్వాత రోజు ఉదయం కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో సిటి ఐస్యా తన లక్ష్యం అయిన బ్లూ టీషర్ట్, స్పోర్ట్స్ జాకెట్ వేసుకున్న ఒక బట్టతల మనిషిని చూసింది.అతడు చెక్ ఇన్ దగ్గరకు రాగానే, అతడి దగ్గరకు వేగంగా వెళ్లి ఒక ద్రవాన్నితన ముఖంపై పోసింది.
అతడు వచ్చీరాని ఇంగ్లీషులో “ఏం చేస్తున్నావ్”అని అరిచాడు
ఆమె “సారీ” అని, అక్కడ్నుంచి పారిపోయింది.
మొత్తం ఏం జరిగిందో ఐస్యా చెప్పింది. కానీ, మలేసియా అధికారులు తనపై హత్యాయత్నం ఆరోపణలు చేయకుండా ఆపలేకపోయింది. ఆమె ఈ పనిని ఒక టీవీ షో కోసం సరదాగా చేసింది.

సిటి ఐస్యా, కిమ్ జోంగ్-నమ్ హత్య కేసులో అరెస్ట్ అయిన తర్వాత చిత్రం
కొన్ని మీటర్ల దూరంలో ఒక కేఫ్‌లో కూర్చున్న ఉత్తర కొరియా ఏజెంట్లుగా భావిస్తున్న ఒక బృందం తమ పని పూర్తైనందుకు సంతృప్తి చెందినట్టు కనిపించింది. డిపార్చర్ గేటులోంచి వారు నడిచి వెళ్లడం, దుబాయి విమానం ఎక్కడం సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది.
లావుగా ఉన్న బట్టతల వ్యక్తికి ఇది ఇబ్బందిగా అనిపించింది. ఆయన ముఖం మండుతోంది, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నట్టుంది. నిమిషాల్లోనే ఆయన కుర్చీలో స్పృహతప్పిపోయారు. విమానాశ్రయ సిబ్బంది ఒక అంబులెన్సు పిలిపించారు. అది కౌలాలంపూర్ వైపు వెళ్తుంటే ఆయన ఊపిరితిత్తులు ద్రవంతో నిండిపోయాయి. ఆయన చనిపోయాడు.
ఆయన పాస్‌పోర్టులో కిమ్ చౌల్, ఉత్తర కొరియా దౌత్యవేత్త అని ఉంది. నిజానికి చనిపోయిన వ్యక్తి కిమ్ జోంగ్-నమ్, కిమ్ జోంగ్-ఉన్ సవతి సోదరుడు.
కిమ్ జోంగ్-నమ్‌కు శక్తివంతమైన వీఎక్స్ అనే నర్వ్ ఏజెంట్‌తో విష ప్రయోగం చేశారు. అది ఒక్క చుక్క పీల్చినా చావు తథ్యం.
కిమ్‌ను ధైర్యంగా చంపారు. ఉత్తర కొరియా ఎలాంటి ప్రమేయం లేదని చెబుతున్నా, ఆధారాలు అన్నీ ప్యాంగ్‌యాంగ్‌లో ఉన్న ఆయన సవతి తమ్ముడి వైపే చూపిస్తున్నాయి.కానీ ఈ హత్యకు కారణం ఏంటి?
ఇద్దరికీ తండ్రి అయిన కిమ్ జోంగ్-ఇల్‌కు వివాదాస్పద ప్రేమకథ ఉంది. ఆయనకు ఇద్దరు అధికారిక భార్యలు, ముగ్గురు ప్రియురాళ్లు ఉన్నారు. వీళ్లతో ఆయనకు ఐదుగురు పిల్లలు పుట్టారు. కిమ్ జోంగ్-నమ్ ఆయన తొలి ప్రియురాలు సాంగ్ హై-రిమ్ కొడుకు. కిమ్ జోంగ్-ఉన్ ఆయన రెండో ప్రియురాలు కో యాంగ్-హుయ్ రెండో కొడుకు. ఆమె జపాన్‌లో పుట్టిన ఒక మాజీ నటి. ఈ నియంత తన ప్రియురాలిని, ఆమె పిల్లలను రహస్యంగా ఉంచాడు. వాళ్లు ఏకాంత భవనాల్లో ఉండేవారు. ఒకే తండ్రికి పుట్టినా కిమ్ జోంగ్-నమ్, కిమ్ జోంగ్-ఉన్ ఎప్పుడూ కలుసుకోలేదు.
పెద్ద కొడుకు కిమ్ జోంగ్-నమ్, కిమ్ జోంగ్-ఇల్ వారసుడు అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ 2001లో నకిలీ పాస్‌పోర్టుతోజపాన్‌లోకి ప్రవేశించబోయాడని ఆయన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన టోక్యోలోని డిస్నీలాండ్ వెళ్లాలని అనుకున్నారు.
ఉత్తర కొరియా యువరాజుకు విమానం నుంచి దిగగానే దేశ బహిష్కరణ విధించారు. ప్యాంగ్‌యాంగ్‌లో ఆయన తండ్రి దీన్ని క్షమించరాని అవమానంగా భావించారు. కిమ్ జోంగ్-నమ్‌ను వారసుడిగా తప్పించి చైనాకు వెళ్లమని దేశం నుంచి బహిష్కరించారు. అలా కథ నడిచింది.
కానీ మొత్తం కథ అది కాదు.

(కిమ్ జోంగ్-ఉన్)ను ఆయన తండ్రే ఎంపిక చేశారు. ఎందుకంటే తన కొడుకుల్లో సమర్థుడు, ప్రమాదకరమైన వాడు అతడే "
తర్వాత వరుసలో కిమ్ జోంగ్-ఇల్ రెండో కొడుకు కిమ్ జోంగ్-చొల్ ఉన్నాడు. కానీ ఆయనెప్పుడూ దాని గురించి ఆలోచించినట్టు అనిపించలేదు. దాంతో ఆయన తన చిన్న కొడుకు కిమ్ జోంగ్-ఉన్‌ను ఎంచుకున్నారు.
“కిమ్ జోంగ్-ఉన్‌ను ఆయన తండ్రే ఎంపిక చేశారు. ఎందుకంటే కొడుకుల్లో సమర్థుడు, ప్రమాదకరమైన వాడు అతడే” అని మార్టిన్ తెలిపారు.
మరో మాటలో చెప్పాలంటే, క్రూరంగా ఉండే వారసత్వ పోరాటాన్ని తట్టుకోడానికి, కుటుంబ పాలనను సజీవంగా ఉంచడానికి ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
“ఆయన కచ్చితంగా తన క్రౌర్యాన్ని చూపించాడు. కిమ్ జోంగ్-ఇల్ చనిపోగానే కిమ్ జోంగ్-ఉన్ అధికారం అందుకున్నాడు. అందుకే ఆయన సవతి సోదరుడిలో భయం మొదలైంది” అని గోమీ అంటారు.
కిమ్ జోంగ్-ఇల్ మరణించాక కిమ్ జోంగ్-నమ్‌లో హఠాత్తుగా అభద్రతా భావం తలెత్తింది. చివరగా మేం 2012లో ఆయనతో మాట్లాడాం. ఆ సమయంలో “నా సోదరుడు కిమ్ నుంచి, రాజవంశం నుంచి నాకు ఏదైనా హాని జరగచ్చు” అని కిమ్ జోంగ్-నమ్ నాతో అన్నారు.
కిమ్ జోంగ్-ఉన్ సొంత సోదరుడిని హత్య చేశాడని మార్టిన్ భావించారు. ఎందుకు అనేదానిపై ఆయన దగ్గర ఒక సిద్ధాంతం ఉంది.
“ఈ చావుకు చాంగ్ సాంగ్-థైక్ (చిన్నాన్న) హత్యతో లింక్ ఉంది. చాంగ్ కుట్ర చేశారనే ఆరోపణలున్నాయి. మేం (పశ్చిమ మీడియా) దాన్ని పట్టించుకోలేదు. తర్వాత కిమ్ జోంగ్-ఉన్ తన సోదరుడిని వెంటాడాడు. చాంగ్ చైనా వెళ్లినట్టు, కిమ్ జోంగ్-ఉన్‌ను తప్పించి, కిమ్ జోంగ్-నమ్‌ను పీఠంపై కూర్చోపెడదామని అక్కడ అన్నట్టు, మా దగ్గర సమాచారం ఉంది. మా చిన్నాన్న, మా అన్న కుమ్మక్కై చైనాలో నాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు” అని కిమ్ అనుకోవడంలో అర్థం ఉంది.
అది సిద్ధాంతం మాత్రమే, కానీ తర్వాత దాని ముగింపు మాత్రం అనివార్యం అనిపించింది.
“ఇప్పుడు ఆయన పాలనకు ముందు ముందు ఎలాంటి ప్రమాదం లేదు.అంతర్గతంగా ఆయన్ను సవాలు చేసే వారందరినీ తప్పించేశారు.”
కిమ్ జోంగ్-ఉన్ ఇప్పుడు సుప్రీంగా ఉన్నారు. కానీ పేదరికంలో ఉన్న తన చిన్న దేశానికి ఆయన ఏం చేయాలని అనుకుంటున్నారు?
1998 వేసవి సెలవుల్లో స్విట్జర్లాండ్ స్కూల్ నుంచి కిమ్ జోంగ్-ఉన్ తిరిగి ఉత్తర కొరియాకు వచ్చారు. వోన్సమ్ దగ్గర సముద్రం పక్కనే ఉన్న భారీ వేసవి విడిదిలో ఆయన కుటుంబంతో గడుపుతున్నారు.
ఇప్పుడు ఆయన తిరిగి రాజధాని ప్యాంగ్‌యాంగ్ వెళ్లే రైల్లోఉన్నారు. ఆయనతో పాటు ఉన్న జపాన్ షెఫ్ కెంజీ ఫుజీమోటో, బయట గ్రామస్థులను, వరి పొలాలను చూస్తున్నారు.
2003లో రాసిన తన పుస్తకంలో “ఫుజీమోటో.. పారిశ్రామిక సాంకేతికతలో మా దేశం మిగతా ఆసియా దేశాల కంటే వెనకబడింది, మాకు ఇంకా కరెంటు కోతలు ఉన్నాయి” అని కిమ్ జోంగ్ తనతో అన్నట్టు ఫుజీమోటో తెలిపారు.
తర్వాత కిమ్ ఉత్తర కొరియా పరిస్థితిని చైనాతో పోల్చాడని ఆయన రాశారు.
“చైనా చాలా రంగాల్లో విజయవంతం అయ్యిందని విన్నా. మా దేశంలో 2కోట్ల 30 లక్షల జనాభా ఉంది. చైనాలో వంద కోట్లకు పైగా జనాభా ఉంది. వాళ్లు అంతమందికి విద్యుత్ ఎలా సరఫరా చేస్తున్నారు? వందకోట్ల మందికి సరిపోయే ఆహారం ఉత్పత్తి చేయాలంటే కచ్చితంగా కష్టంగా ఉంటుంది. వారు చూపిన ఆ మార్గాలను మేం అనుసరించాలి.”
ఫుజీమోటో చెప్పిన కథ నిజమే అయితే అప్పుడు బాల్యంలో కిమ్ జోంగ్-ఉన్ ఆలోచనలు గొప్పగా ఉండేవి.
1995 నుంచి ఉత్తర కొరియా మార్గదర్శక సిద్ధాంతం జూచే.ఈ మాటను తరచూ స్వయం సమృద్ధి అని అనువదిస్తూ ఉంటారు. కిమ్ ఇల్-సంగ్, మార్క్సిస్ట్-లెనినిస్ట్ ఆలోచనలో దీని పాత్ర చాలా ఉంది. ప్యాంగ్‌యాంగ్‌లోని డేడాంగ్ నది దక్షిణ తీరాన జూచే కోసం ఒక భారీ స్మారక చిహ్నాన్నికూడా ఏర్పాటు చేశారు. ఇది వినోదభరితమైనది కాదు.
కానీ జూచే అనేది నిజం కాదు. ఉత్తర కొరియా స్వయం సమృద్ధి చెందిన దేశం కాదు, అది ఎప్పటికీ అలా కాలేదు. మొదటి 40 ఏళ్లలో ఆదేశం దాదాపు పూర్తిగా మాస్కో ఆర్థిక సహకారంపైనే ఆధారపడింది. సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు ఉత్తర కొరియా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు.
కరువుకాటకాల మధ్య ఉత్తర కొరియా ప్రజలు వ్యాపారం ప్రారంభించారు. 1990లో ఏర్పడిన గందరగోళం, పతనం నుంచి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది. నియంత్రణ, అధికారిక గుర్తింపు లేని ఇది ఉత్తర కొరియా ప్రజలను మాత్రం సజీవంగా ఉంచగలిగింది.
సియోల్‌లో ఒక ఉత్తర కొరియా యువకుడిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అక్కడ ఈ “నల్ల”ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా ఉందనే విషయం నాకు అర్థమైంది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గుయెన్-హే, ఉత్తర కొరియాలో డీఎంజడ్ పక్కనే ఉన్న కేసాంగ్ ఇండస్ట్రియల్ జోన్ మూసివేయాలని అప్పుడే ఆదేశాలిచ్చారు.
‘‘నేను ఆ వార్త వినగానే.. చైనా వెళ్లి ‘చాకో పై’లుకొనుక్కురమ్మని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పా’’అని ఆ యువకుడు నాకు చెప్పాడు.
ఇది నన్ను గందరగోళంలో పడేసింది.
నేను “సారీ, మీ నాన్న ఎక్కడున్నారు”అన్నా.
“ఉత్తర కొరియాలో”అన్నాడు.
“ఆయనకు నువ్వు ఎలా ఫోన్ చేశావ్” అన్నా.
వాళ్ల నాన్నకు మొబైల్ ఫోన్‌లో చైనా సిమ్ కార్డ్ ఉంది. ఇది అక్రమం, ప్రమాదకరం. కానీ అక్కడ సర్వసాధారణం. వారానికి ఒకసారి ఆయన చైనా సరిహద్దు వరకూ వెళ్తారు. తన కుమారుడికి ఫోన్ చేయడానికి చైనీస్ మొబైల్ నెట్ వర్క్ కనెక్ట్ చేస్తాడు.
“ఇంతకీ, చాకోపైలు తీసుకొచ్చారా” అని అడిగా
కేసాంగ్ ఇండస్ట్రియల్ జోన్‌లో నడుస్తున్న దక్షిణ కొరియా కంపెనీలు ఉత్తర కొరియా కార్మికులకు వేతనాల్లో కొంత భాగం తమ ఉత్పత్తుల రూపంలో చెల్లిస్తుంటాయి. దక్షిణ కొరియా ఉత్పత్తుల్లో ఒక ప్రముఖ ఉత్పత్తి చాకో పై.
అవి చాలా పాపులర్ అయ్యాయి. అవి ఒక రకంగా ఉత్తరాన బ్లాక్ మార్కెట్ కరెన్సీలా మారాయి. ఇప్పుడు కేసాంగ్ జోన్ మూసేయగానే, నల్ల బజారులో చాకో పై ధర ఆకాశాన్నంటుతుంది. దాంతో అతడు చైనా వెళ్లి తన కోసం వీలైనన్ని చాకో పై బాక్సులు తీసుకురమ్మని వాళ్ల నాన్నకు చెప్పాడు. వాటితో మంచి లాభాలు వస్తాయి.
సియోల్ శివార్లలో ఉన్న ఒక చర్చి దగ్గర నేను భిన్నంగా ఉన్నమరో వ్యక్తిని కలిశా. అతడు కండలు తిరిగిన విశాలమైన భుజాలతో పొట్టిగా ఉన్నాడు. పళ్లు లేవు. తన భాషను అర్థం చేసుకోడానికి నా దక్షిణ కొరియా అనువాదకుడు తంటాలుపడ్డాడు.
అతడు “నేను ఒక స్మగ్లర్” అన్నాడు.
ఉత్తర కొరియా సరిహద్దును రాత్రి వేళ దాటడానికి అక్కడ ఉన్న గార్డులకు తన ముఠా ఎలా లంచం ఇచ్చిందో చెప్పాడు.
“మీరు ఏం స్మగ్లింగ్ చేస్తారు” అని అడిగా
“అన్ని వస్తువులూ, ఆహారం, బట్టలు, డీవీడీలు, డ్రగ్స్, పోర్నోగ్రఫీ” కానీ “డ్రగ్స్, పోర్నోగ్రఫీ తీసుకురావడం ప్రమాదం” అని చెప్పాడు.
“ఉత్తర కొరియా నుంచి జరిగే అక్రమ రవాణాలో అత్యంత ప్రమాదకరమైనది ఏది” అని అడిగా.
“కిమ్ విగ్రహం నుంచి మనం చిన్న లోహం ముక్క తీసినా, తుపాకీతో కాల్చి చంపుతారు” అన్నాడు.
చైనా నుంచి దిగుమతి అయ్యే, అక్రమ రవాణా అయ్యే వస్తువులను ప్రతి నగరంలో, పట్టణంలో పెద్ద మార్కెట్లకు తరలించి అమ్ముతారు.
ఈ అనధికారిక ఆర్థిక వ్యవస్థ బాగానే పనిచేస్తోంది. డబ్బున్న కొత్త తరం పారిశ్రామికవేత్తలు ప్యాంగ్‌యాంగ్‌లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. కానీ అక్కడ సైద్ధాంతిక మార్పు లేదు. అగ్ర స్థానం నుంచి ప్రాథమిక మార్పులను సూచించేది ఏదీ లేదు. ఈ అనధికారిక ఆర్థిక వ్యవస్థ బాగానే పనిచేస్తోంది. డబ్బున్న కొత్త తరం పారిశ్రామికవేత్తలు ప్యాంగ్‌యాంగ్‌లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. కానీ అక్కడ సైద్ధాంతికమార్పు లేదు. అగ్ర స్థానం నుంచి ప్రాథమిక మార్పులను సూచించేది ఏదీ లేదు.
తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 20న ఒక కొరియా వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో కిమ్ జోంగ్-ఉన్ ఒక ప్రసంగం చేశారు.
“వృద్ధి చెందుతున్న మార్పును మరింత ఉన్నత దశకు చేర్చేందుకు అవసరమైన సామ్యవాద నిర్మాణం వేగవంతం కావాలి.”
ముందు ముందు అణ్వాయుధాలు, దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలన్నీ నిలిపివేస్తామని, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టేందుకు “నూతన వ్యూహాత్మక రేఖ”ను అమలు చేస్తామని ఈ సమావేశంలో కిమ్ ప్రకటించారు. చైనా మార్గం అనుసరిస్తానని రైల్లో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చే దిశగా కిమ్ జోంగ్-ఉన్ సన్నద్ధం అయ్యారని చెప్పడానికి ఇది ఒక సంకేతం అని పరిశీలకులు భావించారు.
సియోల్, యోన్సీ యూనివర్సిటీలోని జాన్ డెలురీ వారిలో ఒకరు.
కొత్త వ్యూహం ప్రకారం ఆర్థికశాస్త్రానికి ప్రాధాన్యం- వందకు వంద శాతం ఆర్థిక వ్యవస్థపైనే దృష్టి పెడతారని ఆయన చెప్పారు. “నేను నిజంగా ఆర్థికవ్యవస్థను మెరుగు పరచబోతున్నాను,. మీరు మళ్లీ శ్రమించాల్సిన అవసరం లేదు” అని కిమ్ చెప్పారు.
గత ఐదారేళ్లుగా అది సాధారణ అభివృద్ధి సాధించింది. కానీ ఎలాంటి పురోగతి లేదు. దానికి బదులు ఆయన అణు కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు.అందుకే మేం ఇప్పుడు ఒక మలుపు చూస్తున్నాం.
బ్రాడ్లీ కె మార్టిన్ లాంటి వారు మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
“అతడు గట్టిగా అనుకుంటే ఈ దేశాన్ని మార్చేయవచ్చు. మనకు తెలిసిన కిమ్ వల్ల ఇది అవుతుందో లేదో, నాకుతెలీదు. అలా చేయాలని తను అనుకుని ఉంటే ఆయనకు ఎన్నో ఏళ్లు ఆ అవకాశం వచ్చింది.తండ్రి, తాతల్లా తను కూడా “స్మారకాలు నిర్మిద్దాం” అన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ అదే చేశారు.
“మరో ఆర్థిక వ్యవస్థ ఉందని వ్యూహాత్మకంగా అంగీకరించడం మినహా, ఆర్థిక వ్యవస్థలో నిజంగా సంస్కరణలు వచ్చాయనడానికి నాకు ఏ ఆధారాలూ కనిపించలేదు. అది ఉండి తీరాలి. ఆ మరో ఆర్థిక వ్యవస్థ అనేదే లేకుంటే అంతాచనిపోయి ఉండేవారు.”
కిమ్ జోంగ్-ఉన్ ఇప్పుడు తన దేశాభివృద్ధి కోరుకుంటుంటే ఆయన తను విధించిన ఆంక్షలను ఎత్తివేయాల్సి ఉంటుంది. ఆయనకు వాణిజ్యం, భారీ పెట్టుబడులు కావాలి. అది పొందాలంటే అమెరికా, దాని మిత్ర దేశాలు ఆయన్ను తన “అమ్ములపొదిలో అస్త్రం” అయిన అణ్వాయుధాలను వదులుకోమంటాయి. ఇప్పుడు ఆయన ఉద్దేశం అదేనా?

2017 జులై 4న వేకువ జామున ఉత్తర కొరియా పైన చాలా ఎత్తులో ఉన్న అమెరికా నిఘా ఉపగ్రహం ఉత్తర ప్యాంగ్‌యాంగ్ ప్రావిన్స్‌లోని ఎయిర్ ఫీల్డ్‌లో ఒక కదలికను గుర్తించింది. 16 చక్రాలు ఉన్న ఒక భారీ ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంచర్(టీఈఎల్)ను ఎయిర్ ఫీల్డ్ దగ్గరికి తీసుకొచ్చారు. దానిపైన వెనుక ఒక భారీ క్షిపణి ఉంది.
గంట తర్వాత క్షిపణిని నిలబెట్టడం, ప్రయోగం కోసం ఇంధనం నింపడాన్ని అమెరికా నిఘా అధికారులు గమనించారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ క్షిపణిచుట్టూ తిరగడం స్పష్టంగా కనిపించింది.
ఈ విషయం డిప్లొమాట్ మాగజైన్ ఎడిటర్ అంకిత్ పాండా చెప్పారు.దాని గురించి తనకు రహస్యంగా లీక్ చేశారని చెప్పారు. మండే స్వభావం ఉన్న రాకెట్ ఇంధనానికి అంత దగ్గరగా ఉన్నాడంటే, ఆ సిగరెట్ తాగుతున్న వ్యక్తి కచ్చితంగా కిమ్ జోంగ్-ఉన్ మాత్రమే అయ్యుంటారు.
క్షిపణిని తీయగానే దాని ప్రధాన ఇంజన్ ప్రయోగించారు. అది పెద్ద శబ్దంతో ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఆకాశంలో సుమారు 3000 కిలోమీటర్లు ప్రయాణించాక జపాన్ సముద్రంలో పడి పేలిపోయింది. కిమ్ జోంగ్-ఉన్ సంతోషించారు. తర్వాత విడుదల చేసిన ఫొటోల్లో ఆయన చిరునవ్వు చిందిస్తూ సీనియర్ అధికారులను హత్తుకోవడం కనిపించింది. అక్కడ ఆయన చేతిలోఉన్న సిగరెట్ ఆ కథ చెప్పింది.
ఆ రాకెట్ ఒక కొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అని, అది అమెరికాను చేరగలదని ప్యాంగ్‌యాంగ్ ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్‌కు జులై 4 బహుమతిగా దాన్ని ప్రయోగించారు.
ఆర్థికంగా భారం అయినా, పరీక్షలు ఆపేయాలని అంతర్జాతీయంగా ఒత్తిడి ఎదురవుతున్నా, ఉత్తర కొరియా మొండిగా తన అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగించింది.
2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత కిమ్ జోంగ్-ఉన్ ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమ వేగాన్ని మరింత పెంచారు. తన తండ్రి కంటేచాలా తక్కువ కాలంలోనే ఎన్నో బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించారు.
గత ఏడాది నవంబర్ 29న సరికొత్త భారీ క్షిపణి హ్వాసాంగ్ 15ప్రయోగంతో ఇది ముగింపు దశకు చేరింది. “కొత్తక్షిపణికి ‘సూపర్ హెవీ వెయిట్ వార్‌హెడ్’ తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది, ఇది అమెరికా మొత్తాన్నీ తాకగలదు” అని ఉత్తర కొరియా దేశ వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది.
“దేశ అణు పాటవాన్ని పరిపూర్ణం చేయాల్సిన అవసరాన్ని, రాకెట్ పవర్ నిర్మించాల్సిన అవసరాన్ని చివరికి తాము పూర్తిగా కనుగొన్నామని” కిమ్ జోంగ్-ఉన్ ప్రకటించినట్టు కేసీఎన్ఏ తెలిపింది.
కిమ్ ఇక అమెరికాపై దాడి చేయగలరనే విషయాన్ని ఎంతోమంది విదేశీ నిపుణులు అంగీకరించారు.
దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు తమప్రతినిధులను పంపాలని అనుకుంటున్నట్టు కిమ్ జోంగ్-ఉన్ తన 2018 కొత్త సంవత్సరం సందేశంలో చెప్పారు. ఆ ప్రకటనకు, కిమ్ సందేశానికి మధ్య సమయం కేవలం నెల రోజులు.
ప్రపంచవ్యాప్తంగా ఆ సందేశం చదివిన ఎంతోమంది దాన్నిఒప్పందంపై కిమ్‌లో వచ్చిన నాటకీయ మార్పుగా భావించారు.
కానీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి.అమెరికాను తాకగలిగేలా దీర్ఘ శ్రేణి ఆయుధాలు తయారు చేయాలని కిమ్ ఎందుకు నిర్ణయించారు? అమ్ములపొదిలో అణు క్షిపణులు ఎవరి కోసం?

ఈ ప్రశ్నలకు సమాధానం, దక్షిణకొరియాతో “శాంతియుత సహజీవనం” కోరుకుంటున్నా, అనే కిమ్ మాటలను మనం నమ్మడాన్ని బట్టి, అణు కార్యక్రమానికి తెర దించే చర్చలకు ఆయన సిద్ధంగా ఉన్నాడా, లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌తో ఆయన ఇటీవల జరిపిన శిఖరాగ్ర సదస్సులో కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు కిమ్ జోంగ్-ఉన్ పిలుపునిచ్చారు. ఇక మీదట పరీక్షలన్నీ నిలిపివేస్తానని, అణు పరీక్ష సౌకర్యాలను ధ్వంసం చేస్తానని మాట ఇచ్చారు. కానీ కొరియన్ ద్వీపకల్ప భవిష్యత్ వేదిక అణ్వాయుధ నిపుణుడైన డుయీన్ కిమ్ మాత్రం.. ఏకపక్ష నిరాయుధీకరణకు కిమ్ జోంగ్-ఉన్ సిద్ధంగా ఉన్నారనడంలో అర్థం లేదంటారు. దానికి ఆయన దూరం అని ఆమె చెప్పారు.
“ఆయన నిజానికి దాన్ని (ఉత్తర కొరియా) అణ్వస్త్ర దేశంగా ప్రకటించారు. బాధ్యతాయుతమైన ఆధునిక అణ్వస్త్ర దేశాలు అలాగే చెబుతాయి. దాదాపు ఆరు అణు పరీక్షల తర్వాత వారికి ఇక పరీక్షలు చేయాల్సిన అవసరమే లేదు. అందుకే కిమ్ జోంగ్-ఉన్ తన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటున్నారు, అమెరికాకు సమానంగా ఒక శక్తిమంతమైన దేశాధినేతగా ఇలాంటి శిఖరాగ్ర సదస్సుల్లో అడుగు పెడుతున్నారు” అని ఆమె చెప్పారు.
ఉత్తర కొరియా అణ్వాయుధాలు ఆ దేశ రక్షణ కోసమేనని విస్తృత అభిప్రాయం ఉంది. సద్దాం హుస్సేన్, తర్వాత కల్నల్ గడ్డాఫీ పతనాన్ని చూసిన కిమ్ రాజవంశం.. అమెరికా నేతృత్వంలో సాగుతున్న అధికార మార్పిడిని అడ్డుకోడానికి ఉన్న ఒకే ఒక మార్గం అణ్వాయుధాలు మాత్రమేనని నిర్ణయించింది.
ఆ అభిప్రాయంపై విమర్శకులు మాత్రం “కిమ్ జోంగ్-ఉన్‌కు, ఆయన తండ్రికి తమను కాపాడుకోడానికి ఐసీబీఎం అవసరం ఎప్పుడూ రాలేదనే చెబుతారు. బుసాన్‌లోని డాంగ్సీయో యూనివర్సిటీలోని ప్రొఫెసర్ బ్రియాన్ మైర్స్ వారిలో ఒకరు. రాయల్ ఆసియాటిక్ సొసైటీలో ఇటీవల ప్రసంగించిన ఆయన “అణ్వాయుధాలు సమకూర్చుకోవాలని అనుకున్న పాలకులను అడ్డుకోలేకపోయిన మా అసమర్థతే, దేశ రక్షణకు అవి కీలకంకాదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అణ్వాయుధాలు లేని ఒక ఉత్తర కొరియా, అవి లేని లిబియాలా దుర్భలం అవుతుంది. దానిపై 1998లో బాంబు దాడులు జరిగాయి’’ అన్నారు.
అలా జరగకపోవడానికి కారణం దక్షిణ కొరియా ఎదురుదాడి చేయలేనంత దుర్భలంగా ఉండడమే. దాని రాజధాని సియోల్, డీఎంజడ్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరకొరియా ఆయుధాల పరిధిలో ఉంది.
అయితే, కిమ్ ప్రయోగించిన అణు క్షిపణులు రక్షణ కోసం కాదని మనం అంగీకరించాల్సి వస్తే, అవి ఎందుకు ఉన్నాయి? డూయీన్ కిమ్ ఇచ్చిన సమాధానాన్ని బట్టి “వేర్పాటువాదాన్నిసాధించడానికి, దక్షిణ కొరియాకు అండగా నిలిచేందుకు వస్తున్నఅమెరికాను అడ్డుకోవడానికి, పునరేకీకరణ సమయం ఆసన్నమైందని ప్యాంగ్‌యాంగ్ నిర్ణయించింది.’’
“ఉత్తరం వైపు ఉన్న ప్రజల మాటలు, వారి చర్యలు,వారి వ్యక్తిగత వ్యాఖ్యల ఆధారంగా బలవంతపు ఏకీకరణకు ఉపయోగించడానికి, దానిని నియంత్రించడానికి రెండింటికీ అణ్వాయుధాలు ఉపయోగపడతాయని అనిపిస్తోంది. వాటి గురించి వారు బహిరంగంగా, ప్రైవేటుగా మాట్లాడారు”.
కిమ్ అణ్వాయుధాలు ఏకీకరణ కోసమే అని, దానికి బలవంతం చేయాల్సిన అవసరం లేదని మైర్స్ అన్నారు.
“రెండు శత్రు దేశాలూ శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి అంటే అమెరికాపై అణ్వాయుధాలతో దాడి చేయగల సామర్థ్యం ఉత్తరకొరియాకు అవసరం. ఆ దేశం ఇలాంటి గొప్ప బేరాన్ని ఎప్పుడూ కోరుకునేది.”
“వాషింగ్టన్‌తో జరిగే ఒప్పందంలో ద్వీపకల్పం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్యాంగ్‌యాంగ్ తరచూ చెప్పినట్టు, వారి తర్వాత అడుగు, 1960 నుంచి ఉన్న వాదన ప్రకారం ఉత్తర-దక్షిణ సమాఖ్య ఏర్పాటు చేయడం. తర్వాతేం జరుగుతుంది అనేది ఎవరైనా ఆలోచించడమంటే, అది తెలివి తక్కువ తనమే అవుతుంది.’’
పేదరికంతో వెనకబడ్డ ఉత్తర కొరియా ఆర్థికంగా, సైనిక పరంగా ఎంతో ముందున్న ఆధునిక దక్షిణ కొరియాపై ఏకీకరణ విధించాలని ఆలోచించడంలో అర్థం లేదు. బహుశా అది జరగచ్చు. కానీ “ఇది జరగదని, అది ప్యాంగ్‌యాంగ్ ఉద్దేశమే” అని బ్రాడ్లీ కె మార్టిన్ చెప్పారు.
“వారి ప్రథమ లక్ష్యం ఎప్పుడూ పునరేకీకరణ అనే నా నమ్మకం. చాలామంది దాన్ని ఎప్పుడో వదిలేశారు. తాము అది చేయలేమని వారికి తెలుసు. ప్రజలందరినీ మనం చూసుకోగలిగినప్పుడు, మనం ఏర్పరచగల ఆత్మవిశ్వాసం గురించి వారు తక్కువ అంచనా వేస్తారు. అదే మనం ఒకే వ్యక్తి నియంతృత్వ పాలనలో ప్రచార వ్యవస్థను నడిపిస్తుంటే, ఏదైనా చేయగలిగేలా ప్రజలను మనం ఒప్పించవచ్చు.”
నేను బీజింగ్ వెళ్లే దారిలో ఉండాలి. కానీ నేను ప్యాంగ్‌యాంగ్ హోటల్‌లోని ఒక గదిలో మసక వెలుతురులో కూర్చుని ఉన్నా. దూరంగా గోడపై కిమ్ ఇల్-సంగ్, కిమ్ జోంగ్-ఇల్ ఫొటోలు ఉన్నాయి. ప్రస్తుతం, వారి కవళికలు కోపంగా ఉన్నట్టు కినిపిస్తున్నాయి.
నాకు మగతగా, షాకింగ్‌గాఉంది. టేబుల్ అవతల ఎన్నో ఏళ్ల నుంచీ సిగరెట్ తాగుతున్నట్టు కనిపిస్తున్న ఒక సన్నటి వ్యక్తి నా వైపు ప్రశాంతంగా, భయపెట్టేలాచూస్తున్నాడు.
తన కుడి చేతిలోని వెలిగించని సిగరెట్ తిప్పుతూ “దీన్ని చాలా త్వరగా ముగించవచ్చు, నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు. నీ నేరాన్ని ఒప్పుకుంటే, క్షమాపణ కోరితే ఇదంతా ముగుస్తుంది. లేదంటే పరిస్థితులు చాలాఘోరంగా ఉంటాయి” అన్నాడు.
ఒక గంట ముందు నేను ప్యాంగ్‌యాంగ్ విమానాశ్రయంలో బీజింగ్ వెళ్లే విమానం ఎక్కడానికి సిద్ధం అవుతున్నా. ఇప్పుడు నేను గంటలు, బహుశా రోజులు విచారణ ఎదుర్కొనేలా ఉన్నా.
నన్ను ప్రశ్నిస్తున్న ఆ వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి నేను చేసిన నేరం ఏంటంటే “మార్షల్ కిమ్ జోంగ్-ఉన్‌ను అవమానించడం.” నాకు లోలోపల ఎక్కడో కలుక్కుమంది.
ఇది చాలా తీవ్రమైన నేరం. నేనలా ఎలా చేశానో తెలీడం లేదు. కానీ, నన్ను ప్రశ్నించడంతో ఒకటి మాత్రం స్పష్టమైంది. నా నేరాన్ని ఎక్కడో నిర్ణయించారు. ఇరికించారు. ఇప్పుడు ఆయన కచ్చితంగా నన్ను ఒప్పిస్తారు.

ప్యాంగ్‌యాంగ్‌లో నిర్బంధంలో రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేస్
చీకటి పడగానే టీమ్ మారింది. బెదిరింపులు మరింత భయపెడుతున్నాయి. కొత్త ఇంటరాగేటర్ క్రూరమైన చూపులతో నా కళ్లలోకి సూటిగా చూశాడు.
“కెన్నెత్ బేను ప్రశ్నించింది నేనే. అంటే దానర్థం ఏంటో నీకు తెలుసనే అనుకుంటున్నా” అన్నాడు.
తెలుసు, కెన్నెత్ బే ఒక కొరియన్-అమెరికన్ పాస్టర్, ఉత్తరకొరియా ఆయనకు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 735 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఒక ఒప్పందంతో ఆయన విడుదలయ్యారు.
నా విచారణ భయంకరంగా, వింతగా కూడా జరిగింది. నోబెల్ గ్రహీతలు ముగ్గురిని కవర్ చేసేందుకు నన్ను ప్యాంగ్‌యాంగ్ ఆహ్వానించారు. తర్వాత నన్ను జైల్లో బంధించారు. నాకు నచ్చని పాలన గురించి నేను రాయడమే దానికి కారణం.
“నాకు ఇది ప్రతికూలంగా అనిపించింది. కానీ నాకు అప్పగించిన పాత్రను అర్థం చేసుకోవడంలో నేను సైద్ధాతికంగా విఫలమయ్యా. ఉత్తర కొరియాలో జరుగుతున్న నిజాల గురించి బయటి ప్రపంచానికి అందించాను. నేను అతిక్రమించాను. ఒక శత్రువుగా మారాను.’’
కొన్ని వారాల తర్వాత సియోల్‌లో ఉంటున్న ఒక ఉత్తర కొరియావాసి దీని గురించి వివరంగా చెప్పారు.
“మనం చేసిన నేరం కిమ్ జోంగ్-ఉన్‌ను అవమానించడం మాత్రమే కాదు, మనం ఎక్కడ అలా చేశామనేది కూడా లెక్కలోకి వస్తుంది. ఆయన్నుతన సొంత రాజధానిలోనే అవమానించారు” అన్నారు.
నా నిర్బంధాన్ని, విడుదలను ఆమోదించగల ఏకైక వ్యక్తి కచ్చితంగా ఆయనే, కిమ్ జోంగ్-ఉన్.
“బయట పడాలంటే అదృష్టం ఉండాలి” అన్నాడు.
ప్రొఫెసర్ పైక్ హక్-సూన్ దక్షిణ కొరియాలో ఉన్న సీజోంగ్ ఇన్‌స్టిట్యూట్ నార్త్ కొరియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్. దేశ బహిష్కరణ శిక్షతో మాత్రమే బయటపడ్డందుకు, ఆయన తనకు తాను అదృష్టవంతుడుగానే భావిస్తారు.
“కిమ్‌కు రాజుగా గుర్తింపు ఉంది. ప్రతిపక్షం నుంచి, ఇతరుల నుంచి ఎలాంటి విమర్శ వచ్చినా ఆయన ఆత్మ గౌరవం దాన్ని భరించలేదు. ఆయన్ను సవాలు చేసిన ఎవరైనా, ఏదేశమైనా కచ్చితంగా ప్రతీకారం రుచిచూడాల్సిందే” అని చెప్పారు.
చిన్న తప్పులకే విదేశీయులను నిర్బంధించిన సుదీర్ఘ చరిత్ర ఉత్తరకొరియాకు ఉంది. ప్రధానంగా కిమ్ జోంగ్-ఉన్ ప్రవృత్తి అదే. 2011 నుంచి 12 మంది విదేశీయులను, నలుగురు దక్షిణ కొరియా వాసులను ప్యాంగ్‌యాంగ్‌లో నిర్బంధించారు.
2016లో నన్ను నిర్బంధించే ముందు, ఒట్టో వార్మ్‌బీర్ అనే అమెరికా యువ పర్యాటకుడిని నిర్బంధించారు. ఒక హోటల్ గోడపై ప్రచార పోస్టర్ దొంగిలించిన నేరానికి 15 ఏళ్ల కఠినశిక్ష విధించారు. ఆయనకు విధించిన శిక్షకు, తనపై ఆరోపించిన నేరానికి ఎలాంటి సంబంధం లేనట్టు అనిపించింది.

అమెరికా పౌరుడు ఒట్టో వార్మ్‌బీర్, ఉత్తర కొరియాలో అరెస్ట్ చేసిన చిత్రం
మెదడు తీవ్రంగా దెబ్బతినడంతో వార్మ్‌బీర్ చివరికి అమెరికాకు తిరిగి రాగలిగారు. తర్వాత కొన్ని రోజులకే మరణించారు. చాలా మంది పరిశీలకులు ఆయన కేసును అసాధారణంగా భావించారు. అమెరికా బందీలను శారీరకంగా హింసించడం అనేది అరుదుగాజరుగుతుంది. వాళ్లు చాలా విలువైనవారు.
ప్యాంగ్‌యాంగ్ దౌత్య క్రీడలో అమెరికా బందీలు పావులుగామారుతారు. అమెరికా ప్రభుత్వం సుదీర్ఘ చర్చలకు దిగి వచ్చేలా, బంధించిన వ్యక్తిని విడిపించేందుకు చివరకు ఉన్నత స్థాయి రాయబారిని పంపేలా బలవంతం చేస్తారు. ఇద్దరు అమెరికా జర్నలిస్టులను వెనక్కు తీసుకొచ్చేందుకు 2009లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్వయంగా ప్యాంగ్‌యాంగ్ వెళ్లారు.
అమెరికా మాజీ దౌత్యవేత్త డేవిడ్ స్ట్రాబ్ ఆ పర్యటనలో బిల్ క్లింటన్‌తోపాటు ఉన్నారు.
“ఇద్దరు జర్నలిస్టులను తిరిగి అప్పగించాలంటే బిల్ క్లింటన్ దేశానికి కచ్చితంగా రావాలని ఉత్తర కొరియా డిమాండ్ చేసింది. బిల్ క్లింటన్‌తో కిమ్ జోంగ్-ఉన్ ఒక ఫొటో తీసుకుంటే చాలని, వారు అనుకుంటున్నట్టు స్పష్టమైంది. తాము బలవంతంగా అమెరికా మెడలు వంచగలిగామని వాళ్లు తమ ప్రజలకు, ప్రపంచానికి ఆ ఫొటో చూపించి సంబరపడవచ్చు” అని ఆయన అన్నారు.
కానీ కిమ్ జోంగ్-ఉన్ నిజంగా కోరుకుంటోంది అమెరికా మాజీ అధ్యక్షుడిని కలవాలని కాదు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడితో కూర్చుని ముఖాముఖి చర్చలు జరపాలనేదే ఆయన అసలు కోరిక.
మే 9న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపేయో ప్యాంగ్‌యాంగ్ వచ్చారు. నెల రోజుల్లో అది ఆయన రెండో పర్యటన. ఆయన కిమ్ జోంగ్-ఉన్‌ను కలిశారు. ఉత్తర కొరియా కస్టడీలో ఉన్న ముగ్గురు అమెరికా పౌరులను మైక్‌కు అప్పగించారు.
ఉత్తర కొరియా ఎక్కువ కాలం బంధీగా ఉంచిన వ్యక్తి కిమ్ జోంగ్-చల్, 65 ఏళ్ల ఈ కొరియా-అమెరికా వ్యాపారవేత్త ఆదేశంలో 952 రోజులు కస్టడీలో ఉన్నారు. కిమ్ జోంగ్-ఉన్‌తో శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతాననే నిబంధనపై ముగ్గురినీ విడుదల చేయాలని అధ్యక్షుడు ట్రంప్ అడిగారు.
ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో విడుదలైన ముగ్గురు బందీలను పలకరించిన అమెరికా అధ్యక్షుడు “మేం కిమ్ జోంగ్-ఉన్‌కు ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాం. ఆయన ఈ ముగ్గురినీ విడిపించి చాలా మంచి చేశారు” అని ప్రకటించారు.
ఉత్తర కొరియా నేతతో తొలి శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అనడానికి అది ఒక అతిశయోక్తిగా అనిపించింది.
దాన్ని రద్దు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ట్రంప్ మాత్రమే. చర్చలకు అమెరికానే సిద్ధంగా లేదని చెప్పుకునే అవకాశాన్ని ఆయన ఉత్తర కొరియాకే వదిలేశారు.

CREDITS
రచయిత: రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేస్
ఆన్‌లైన్ ప్రొడక్షన్-బెన్ మిల్నే
గ్రాఫిక్స్-జాయ్ రోక్సాస్
ఫొటో క్రెడిట్స్-అలమీ; ఈపీఏ, గెట్టీ ఇమేజెస్, రాయిటర్స్