ప్రభుత్వం చెబుతున్న ప్రకారం 10శాతం గృహాలు, అన్ని ప్రభుత్వ భవనాలు గ్రిడ్ కు అనుసంధానమై ఉంటే ఆ గ్రామంలో విద్యుదీకరణ జరిగినట్లే . 2018 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి విద్యుత్ అందించాలనే లక్ష్యంతో 2015 ఆగస్టులో ప్రధాని మోదీ రూ. 16,663 కోట్ల వ్యయంతో ఈ పథకం ప్రకటించారు.
ఈ పథకంలో భాగంగా 5,97,464 గ్రామాలు, 50 లక్షల గృహాలను గ్రిడ్‌కు అనుసంధానించారు.
1947లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి భారతదేశం ఎంతో సాధించింది. b
1947లో..
కేవలం 1500 గ్రామాలకు మాత్రమే విద్యుత్ ఉండేది.
2005 నుంచి 2014 మధ్య కాలంలో..
10,82,280 గ్రామాల్లో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి.
మే 2018 నాటికి..
అదనంగా 18,452 గ్రామాలను విద్యుదీకరించారు. దీంతో దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
అయితే, దేశంలోని దాదాపు అన్ని గ్రామాలకు ఎంతో కొంత విద్యుత్ సరఫరా ఉంది. కానీ మారుమూల ప్రాంతంలోని ఇళ్లకు విద్యుత్ పంపిణీ చాలా ఖర్చుతో కూడుకున్నది.
కానీ, నెల నెలా వచ్చే బిల్లులు కట్టలేక కొందరు కావాలనే కరెంట్ కనెక్షన్ తీసుకోవడం లేదు. కరెంట్ కోతలు ఎక్కువగా ఉన్నపుడు విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు జనం పెద్దగా ఆసక్తిచూపడం లేదు.







