దిల్లీ: పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి, వైజయంతిమాలా బాలి

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి పద్మ అవార్డుల ప్రదానం జరిగింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. దిల్లీ: పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి, వైజయంతిమాలా బాలి

    పద్మ అవార్డ్స్

    ఫొటో సోర్స్, @rashtrapatibhvn

    రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందించారు.

    ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    అవార్డులు అందుకున్న వారిలో నటుడు చిరంజీవి, సీనియర్ నటి వైజయంతిమాలా బాలి (పద్మ విభూషణ్) అవార్డులు, సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జి ఫాతిమా బీవీ (మరణానంతరం), బాంబే సమాచార్ పత్రిక అధినేత హొర్ముస్జీ ఎన్ కామా, నటుడు విజయకాంత్(మరణానంతరం) తదితరులకు పద్మభూషణ్ అవార్డులను అందజేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. మాల్దీవులు: ‘ఇండియా అవుట్’ అన్న ఆ ప్రభుత్వమే భారత్‌కు విదేశాంగ మంత్రిని ఎందుకు పంపింది, తెర వెనక ఏం జరుగుతోంది?

  4. మల్టీ టాస్కింగ్‌తో మతి మరుపు పెరుగుతుందా?

  5. ఐకే గుజ్రాల్: ‘నాతో మాట్లాడాలనుకుంటే మర్యాదగా మాట్లాడు’ అని సంజయ్ గాంధీతో ఎందుకు అన్నారు?

  6. మదర్స్ డే: తల్లిపాలు బిడ్డలకు ఎప్పుడు, ఎలా మాన్పించాలి?

  7. పర్వీన్ షేక్: సోషల్ మీడియా పోస్టులను లైక్ చేశారంటూ ప్రిన్సిపల్‌ను తొలగించిన స్కూల్ యాజమాన్యం... అసలేం జరిగింది?

  8. కోవిషీల్డ్ తయారీని 2021లోనే ఆపేశాం: సీరమ్ ఇన్‌స్టిట్యూట్

    కోవిషీల్డ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కోవిషీల్డ్ వ్యాక్సీన్

    2021 డిసెంబర్ నుంచే కోవిషీల్డ్ వ్యాక్సీన్ తయారీని నిలిపివేసినట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

    అంతకుముందు, తమ కోవిడ్ వ్యాక్సీన్‌ను ప్రపంచ మార్కెట్ నుంచి ఉపసంహరిచుకుంటున్నట్లు ఫార్యాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా తెలిపింది.

    ఆస్ట్రాజెనెకా సహకారంతో, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సీన్‌ను రూపొందించింది.

    "భారత్‌లో 2021, 2022లో భారీ స్థాయిలో కోవిడ్ టీకాలు ఉత్పత్తి చేసింది. కానీ, కొత్త వేరియంట్లు రావడంతో పాత వ్యాక్సీన్‌కు డిమాండ్ తగ్గింది'' అని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

    "అందువల్ల 2021 డిసెంబర్‌లోనే వ్యాక్సీన్ తయారీని నిలిపివేశాం. కోవిషీల్డ్ వ్యాక్సీన్ సరఫరాను కూడా నిలిపివేశాం'' అని పేర్కొన్నారు.

    ''వ్యాక్సీన్‌ భద్రతా ప్రమాణాల విషయంలో మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. 2021లో మార్కెట్‌లోకి విడుదలైన కొన్ని వ్యాక్సీన్ల వల్ల దుష్ఫ్రభావాలు తలెత్తినట్లు సమాచారం ఉంది'' అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

    ఇటీవల ఆస్ట్రాజెనెకా కంపెనీ బ్రిటిష్ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో తమ కోవిడ్ వ్యాక్సీన్ కొందరిలో దుష్ప్రభావాలకు దారితీసే అవకాశం ఉందని అంగీకరించింది.

    ఈ కంపెనీ వ్యాక్సీన్ వేయించుకున్న చాలా మంది వ్యక్తులు దుష్ప్రభావాల కారణంగా నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంపెనీపై కేసు వేశారు.

  9. తల్లి కావడానికి సరైన వయసు ఏది

  10. కర్నూలు జిల్లాలోని ఈ ఊళ్లు ఎందుకు ఖాళీ అవుతున్నాయి, జనమంతా ఎక్కడికి వెళుతుంటారు?

  11. రఫాలో దాడులు: ఇజ్రాయెల్‌కు అమెరికా హెచ్చరిక

    జో బైడెన్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గట్టి హెచ్చరికలు చేశారు.

    ఇజ్రాయెల్ రఫాలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తే, తాము కొన్ని ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని తెలిపారు.

    ‘‘ఒకవేళ మీరు రఫాలోకి వెళ్తే, మేం ఆయుధాలు ఇవ్వం’’ అని బైడెన్ అన్నారు.

    ఇజ్రాయెల్‌ను సురక్షితంగా ఉంచేందుకే తాము కృషి చేస్తామని చెప్పారు.

    అమెరికా హెచ్చరించినప్పటికీ, రఫాలో ఇజ్రాయెల్‌ మరింత ముందుకు వెళ్తోంది. రఫాపై పెద్ద ఎత్తున దండయాత్ర ప్రారంభించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది.

    రఫాలో హమాస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దాడి ప్రారంభించకపోతే, ఈ యుద్ధంలో గెలవలేమని ఇజ్రాయెల్ చెబుతోంది.

    రఫాాలో దాడి చేసేందుకు ముందస్తు హెచ్చరికగా ఆ ప్రాంతంలో ఉన్న లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది.

    ఇజ్రాయెల్ రఫాలో చేసే దాడులతో, చాలా మంది ప్రజలు చనిపోవచ్చని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.