ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
కాంగ్రెస్ యువరాజు ఉన్నట్టుండి అంబానీ, అదానీలను తిట్టడం మానేశారని, ఇందులో ఏదో మతలబు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ల నుండి కోవిడ్ వ్యాక్సీన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.
ఇది పూర్తిగా బిజినెస్‌కు సంబంధించిన నిర్ణయమని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
కోవిడ్ కొత్త వేరియంట్‌లను లక్ష్యంగా చేసుకుని అనేక ఇతర వ్యాక్సీన్‌లు మార్కెట్లో అందుబాటులోకి రావడంతో తమ టీకాకు డిమాండ్ తగ్గిందని ఆస్ట్రాజెనెకా తెలిపింది.
అయితే, తమ వ్యాక్సీన్ తీసుకున్న వారిలో కొన్ని అసాధారణమైన దుష్ప్రభావాలు కలిగిన మాట వాస్తవమేనని ఇటీవల బ్రిటిష్ కోర్టుకు సమర్పించిన పత్రాలలో ఆస్ట్రాజెనెకా మొదటిసారి అంగీకరించింది.
కరోనా వ్యాక్సీన్ తీసుకున్న అనేకమంది తమకు కలిగిన దుష్ప్రభావాలపై నష్ట పరిహారం కోరుతూ ఆస్ట్రాజెనెకా పై కేసు వేశారు.
ఆస్ట్రాజెనెకాతో సహా వివిధ కంపెనీల కరోనా వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడిందని అనేక అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. ఆస్ట్రాజెనెకా ఒక్కటే మొదటి సంవత్సరంలో 60 లక్షలమందికి పైగా ప్రాణాలను కాపాడింది.

ఫొటో సోర్స్, ANI
తెలంగాణలోని వేములవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అంబానీ, అదానీ పేర్లను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మోదీ విమర్శలు చేశారు.
''గత ఐదేళ్లుగా కాంగ్రెస్ యువరాజు నిద్రలేచిన దగ్గరి నుంచి ఒకటే జపం చేశారు. రఫేల్ కేసు కొట్టివేసినప్పటి నుంచి కొత్త జపం చేస్తున్నారు. ఐదుగురు పారిశ్రామికవేత్తలు.. ఐదుగురు పారిశ్రామికవేత్తలు.. ఐదుగురు పారిశ్రామికవేత్తలు.. అనేవారు. ఆ తర్వాత అంబానీ - అదానీ, అంబానీ - అదానీ అని అనడం మొదలుపెట్టారు''
''అయితే, ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటి నుంచి అంబానీ, అదానీలను తిట్టడం మానేశారు. ఈరోజు నేను తెలంగాణ నుంచి అడుగుతున్నా. అంబానీ, అదానీల నుంచి ఎంత సొమ్ములు సేకరించారో యువరాజు చెప్పాలి. ఎన్ని సంచుల నల్లధనం నొక్కేశారు? కాంగ్రెస్ పార్టీకి నోట్లు చేరాయా?'' అని బహిరంగ సభలో మోదీ ప్రశ్నించారు.
''డీల్ ఏంటి? రాత్రికి రాత్రే అంబానీని, అదానీని తిట్టడం మానేశావ్. ఇందులో కచ్చితంగా ఏదో మతలబు ఉంది. ఐదేళ్లు అంబానీని, అదానీని దుర్భాషలాడి, రాత్రికి రాత్రే అన్నీ ఆపేశారు. అంటే, టెంపో నిండా మీకు సొమ్ము అందింది. మీరు దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది'' అని మోదీ అన్నారు.
అంబానీ - అదానీ విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలాకాలంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారు. అదానీ గ్రూప్‌కు సహకరించేందుకు ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గౌతమ్ అదానీతో కలిసి విమానంలో కూర్చున్న ఫొటోలను ఏడాది కిందట రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రదర్శించారు. ఆ ఫోటోలను చూపిస్తూ గౌతమ్ అదానీకి, ప్రధాని మోదీకి సంబంధమేంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
హరియాణా బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.
హరియాణా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 90, ఇందులో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
అసెంబ్లీలో బీజేపీకి 40, కాంగ్రెస్‌కు 30, జననాయక్ జనతా పార్టీకి 10, స్వతంత్రులు 6, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, హరియాణా లోఖిత్ పార్టీ (హెచ్‌ఎల్‌పీ)కి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీలోని 88 స్థానాల్లో బీజేపీకి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
అయితే, నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ప్రస్తుతం 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఇందులో 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాగా, ఒకరు హెచ్‌ఎల్పీ, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
మంగళవారం విలేఖరుల సమావేశంలో, చర్ఖి దాద్రీ ఎమ్మెల్యే సోంబిర్ సాంగ్వాన్, నీలోఖేరీ నుంచి ధరంపాల్ గోండార్, పుండ్రి నుంచి రణధీర్ గోలన్ తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలియజేశారు.
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంపై హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు.
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ''ఈ ఎన్నికల వాతావరణంలో ఎవరు ఎటు వైపు వెళ్లినా ఏమీ తేడా రాదు. చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. అందువల్ల, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు'' అన్నారు.
ఇటీవల బీజేపీ అధిష్టానం హరియాణా సీఎంగా మనోహర్ లాల్‌ను తప్పించి, ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది. ఆ సమయంలో, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో భవన నిర్మాణంలో భాగంగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఆ భవనంలో సెంట్రింగ్ పనిచేస్తున్న కొందరు రిటైనింగ్ వాల్‌కు ఆనుకుని తాత్కాలిక గుడిసెలు వేసుకున్నారు. వారంతా ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కూలీలు.
అకాల వర్షానికి రిటైనింగ్ వాల్ కూలిపోయి పక్కనే ఉన్న తాత్కాలిక గుడిసెలపై పడడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన తిరుపతి మాజి(20), శంకర్(22), రాజు(25), ఖుషితోపాటు చత్తీస్‌గఢ్‌కి చెందిన రామ్ యాదవ్(34), అతని భార్య గీత(32), కుమారుడు హిమాన్షు(4) చనిపోయారు.

ఫొటో సోర్స్, UGC
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బేగంపేట నాలాలో వర్షపు నీటిలో మరో రెండు గుర్తుతెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
కోవిడ్ - 19 వ్యాక్సీన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కోవిడ్ -19 వ్యాక్సీన్ విరివిగా అందుబాటులో ఉందని, అప్డేటెడ్ వ్యాక్సీన్ల మిగులు నిల్వల కారణంగా వ్యాక్సీన్ ఉపసంహరణ ప్రారంభించినట్లు ఆ కంపెనీ మంగళవారం తెలిపింది.
యూరప్‌లో వ్యాక్సీన్ వ్యాక్స్‌జెవ్రియా మార్కెటింగ్ అనుమతులను కూడా ఉపసంహరించుకోనున్నట్లు కంపెనీ పేర్కొందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''వివిధ వేరియంట్లకు సంబంధించి కోవిడ్-19 వ్యాక్సీన్‌లు అభివృద్ధి చేసినందున, ఇప్పటికే అందుబాటులో ఉన్న అప్డేటెడ్ వ్యాక్సీన్ల మిగులు ఉంది'' అని కంపెనీ తెలిపింది. ఇది వ్యాక్స్‌జెవ్రియా డిమాండ్ తగ్గడానికి దారితీసిందని, అందువల్ల ఇకపై ఈ వ్యాక్సీన్ తయారీ నిలిపివేయడంతో పాటు సరఫరా కూడా ఉండదని ఆస్ట్రాజెనెకా చెప్పిందని రాయిటర్స్ వెల్లడించింది.
కోవిడ్ టీకా కారణంగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం వంటి సమస్యలు వచ్చినట్టు ఈ ఆంగ్లో-స్వీడిష్ కంపెనీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అంగీకరించింది.
వ్యాక్సీన్‌ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియను మే 5న ప్రారంభించగా, మే 7వ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చినట్లు టెలిగ్రాఫ్ తొలుత రిపోర్ట్ చేసినట్లు రాయిటర్స్ పేర్కొంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కథనాల కోసం ఈ పేజీని చూడండి.